CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి.

Share it:

 


దమ్మపేట ఏప్రిల్ 07 ( మన్యం మనుగడ ) : బ్రిటీష్ గుండెలలో బాణంలా దూసుకుపోయిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 98 వ వర్ధంతి పార్కలగండి గ్రామంలో ప్రగతి శీల యువజన సంఘం ( PYL) మండల కమిటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో PYL రాష్టృ నాయకులు కాక వెంకటేష్ మాట్లాడుతూ మన్యం వీరుడు ఆదివాసి గిరిజనులపై బ్రిటిష్ వారి దమనకాండ రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ఆదివాసీ గిరిజనులను ఏకం చేసి గెరిల్లా దళాలను నిర్మించి బ్రిటిష్ వారిపై పోరాటాన్ని ప్రారంభించాడు

 బ్రిటిష్ ప్రభుత్వానికి అల్లూరి తో పోరాటం చేయలేని పరిస్థితి లో ఆదివాసి గూడాలపై బ్రిటిష్ ముష్కరులు విరుచుకుపడ్డారు అల్లూరిని లొంగిపోవాలి అంటూ ప్రకటనలు చేశారు ఇదే సమయంలో ఒక ఏటి గట్టు వద్ద స్నానం చేస్తుండగా అల్లూరి సీతారామరాజు నీ 1924 మే 07 బంధించి ఎటువంటి విచారణ లేకుండా ఒక చెట్టుకు కట్టేసి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారని అన్నారు

ఈ దోపిడి రాజ్యం ప్రజా సమస్యలపై ఉద్యమించే ఉద్యమకారులను నిర్మూలించవచ్చు, కానీ ప్రజా ఉద్యమాలను నిర్మూలించ లేవని, అల్లూరి చూపిన బాటలో పయనించి అల్లూరి ఆశయాలను సాధించేవరకు ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని అన్నారు 

9/5/2022న ప్రగతి శీల యువజన సంఘం PYL జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఇల్లందు లో జరుగుతుందని ఈ జనరల్ బాడీ ని విజయవంతం కై యువకులు అదిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో బైట రాజ్ కుమర్ కాక చంధు,కారం నగేంద్రబాబు,కారం కృష్ట,కాక బజారు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: