CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలి.మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు సిఎం కేసిఆర్ కు ధన్యవాదాలు.

Share it:

 


  • జవహార్ నవోదయ పాఠశాల, గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను.
  • జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
  • ఉద్యోగ నియామకాల్లో జిల్లా వాసులకు ఎక్కువ జాబ్స్ రావడానికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ మే 5నుంచి ప్రారంభిస్తున్నాం.
  • కోచింగ్ సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగ యువతకు విజ్ణప్తి.
  • జిల్లా అభివృద్ధిలో అందరూ భాగం కావాలి.
  • రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

మన్యం మనుగడ ములుగు

ములుగు రెవెన్యూ డివిజన్ కావడమే గగనం అనుకుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల జిల్లా అయిందని,ఈ జిల్లా అభివృద్ధికోసం ముఖ్యమంత్రి అనేక సంస్థలు, వసతులు తీసుకొస్తున్నారని, ఈ ప్రగతిలో ప్రజలంతా సహకరించి, భాగస్వాములు కావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కోరారు.

ములుగు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేడు ములుగు జిల్లా, జాకారం వద్ద గట్టమ్మ దేవాలయం హరిత హోటల్ లో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రేమతో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారని,అంతకంటే ఎక్కువ ప్రేమతో ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీ, వంద పడకల హాస్పిటల్ ఇచ్చారని,దీనికి జిల్లా ప్రజల తరపున వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. వీటి ఏర్పాటుతో హైదరాబాద్, వరంగల్ లో దొరికే వైద్య సదు పాయాలు ములుగులోనే లభించనున్నాయన్నారు. ఇప్పటికే ఐసియు పడకల వార్డు,ఎంసిహెచ్ వార్డును ఇటీవలే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించా రన్నారు.మెడికల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేసుకు న్నామని, ఇక్కడే నర్సింగ్ కాలేజీ, సిబ్బంది క్వార్టర్లు రానున్నాయని, దీనికి కనీసం 20 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు.త్వరలోనే వంద పడకల హాస్పిటల్,దాని కాంపౌండ్ వాల్ పనులు ప్రారంభించుకుంటున్నామని, ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు.

జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా కార్యాలయాలు కూడా వస్తున్నాయన్నారు.ఇక్కడే జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం కోసం 50 ఎకరాల స్థలాన్ని కేటాయిం చామని, టెండర్లు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతు న్నాయని ప్రకటించారు. ములుగు జిల్లా కావడం,అనేక సంస్థలు రానుండడంతో భూముల ధరలు బాగా పెరిగాయన్నారు.అయితే ఇక్కడ ఉన్న వారు గిరిజనులు, పేదవారు ఎక్కువగా ఉన్నారని, వీరంతా అభివృద్ధి చెందాలంటే జిల్లా ప్రగతి పథంలో కొనసా గాలన్నారు. ఇందుకోసం జిల్లాలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వంద పడకల హాస్పిటల్, ఇతర కార్యాల యాలు రావడానికి చాలా భూమి అవసరం అవుతుంద న్నారు. జిల్లా ప్రకటించక ముందు ఇక్కడ భూములకు అంత విలువ లేదని,ఇప్పుడు బాగా విలువ పెరిగిందన్నారు. అయితే ఇక్కడున్న వారు కూడా పేదవారు కావడంతో ప్రత్యామ్నాయం లేక ఖాళీ చేయమని కోర్టులకు వెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి పేదవారికి ప్రభుత్వ భూములు ఇతర చోట్ల ఇస్తాం కానీ, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ అవసరాలకు ఉన్న భూములను ఖాళీ చేసి, జిల్లా అభివృద్ధికి సహకరించాలని విజ్ణప్తి చేశారు.ఏటూరు నాగారం పరిధిలోని 5 మండలాల పరిధిలోని ప్రజలు ప్రతి దానికి ములుగు రాకుండా అక్కడే అన్ని సేవలు పొందే విధంగా వసతులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామ న్నారు.ప్రతి జిల్లాకు జవహార్ నవోదయ పాఠశాల ఇవ్వాలని సిఎం కేసిఆర్ కేంద్రాన్ని అడుగుతున్నారని,ప్లీనరిలో కూడా దీనిపై తీర్మాణం చేశామన్నారు.అయితే నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది? అని వారు అడిగారు. తాసిహల్ దేవి పేటలో 30 ఎకరాల భూమి ఉన్నట్లు భూమి పత్రాలు కలెక్టర్ పంపిం చారన్నారు.ప్రతి జిల్లాకు వెంటనే జవహార్ నవోదయ పాఠశాలలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.

గిరిజన విశ్వ విద్యా లయం కూడా జిల్లాకు ఇప్ప్పటికే రావల్సి ఉందన్నారు.ఇవన్నీ వస్తే ఈ ప్రాంత ప్రజలకు చాలా మేలు జరుగుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించి,ఈ సంవత్సరాన్ని ఉద్యోగనామ సంవత్సరంగా మార్చారన్నారు.ఇందులో 11వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నారని చెప్పారు.మిగిలిన దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ రిక్రూట్ మెంట్, గ్రూప్ -1 కు కూడా నోటిఫికేషన్లు కూడా వచ్చాయన్నారు.ఈ నేపథ్యంలో ఈ ప్రాంత గిరిజన, పేద నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.ఇందుకోసం ఇప్పటికే 800 మంది తమ పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు.వీరందరికీ మంచి సిబ్బంది,వసతులతో రెసిడెన్షియల్ విధానంలో కోచింగ్ ఇవ్వడానికి గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.

మే 5 తేదీ నుంచి కోచింగ్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.ఇన్ని ఉద్యోగాలు వస్తున్నందున నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్య మంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన నూతన జోనల్ విధానం వల్ల ములుగు జిల్లా అభ్యర్థులకే ములుగు ప్రాంత ఉద్యోగాలన్నీ వస్తాయన్నారు.మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరి ఉందని, ఈ 5 శాతంలో కూడా ములుగు జిల్లా వాళ్లు పోటీ పడవచ్చ న్నారు.నిరుద్యోగ యువత ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసు కునే విధంగా ప్రతి ఉద్యోగ ప్రకటన మద్య కొంత సమయం ఉండే విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నారని తెలిపారు. ములుగు జిల్లాకు 696 ఉద్యోగాలు ఉన్నాయని, ఇందులో రాష్ట్ర స్థాయి,మల్టీ జోనల్,జోనల్, జిల్లా స్థాయి ఉద్యోగాలున్నాయని వివరించారు.వీటిని సాధిం చేందుకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు, పురుషులకు వేర్వేరు వసతి సౌకర్యంతో కోచింగ్ ఇవ్వనున్నామని తెలిపారు.వికాసం పేరుతో వికలాంగుల కోసం అన్ని హంగులతో స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటయ్యే ఈ స్కూల్ ను ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.ఇక్కడి ఐటిడిఏ, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పంచాయతీ భవనాలు, ఎకనామిక్ సపోర్ట్ స్కీముకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు రాబోతున్నాయని, వీటి ద్వారా అన్ని విధాల ములుగు అభివృద్ధి జరగనుందని చెప్పారు. గట్టమ్మ తల్లి దేవాలయం ఎదురుగా 336 ఎకరాల భూమిని గిరిజన విశ్వ విద్యా లయం కోసం ఇచ్చామని,డిగ్రీ కాలేజీ పక్కన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం కోసం 50 ఎకరాల భూమి ఇచ్చామన్నారు.దీనికి సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయని,త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని,ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఏఎస్పీ సుధీర్ కెకన్,డిఆర్వో రమాదేవి

అధికారులు,తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: