CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బలమైన ప్రజా ఉద్యమాలతోనే ఫాసిజాన్ని ఓడించగలం.న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు

Share it:


దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలతో పాటు, దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేటు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారానే ప్రజలపై అణచివేత, నిర్బంధ విధానాలకు పాల్పడుతున్న ఫాసిజాన్ని ఓడించగలమనీ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు పేర్కొన్నారు. గురువారం పాల్వంచ రూరల్ మండలం పాండురంగాపురం గ్రామంలో న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ స్థాయి రాజకీయ తరగతులు గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హిందూ ఫాసిజం కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, అంశంపై ఆవునూరి మధు క్లాసు బోధించగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనే అంశంపై పై క్లాసు న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి బోధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం విద్యార్థి, యువత మెదళ్ళలో కాషాయీకరణ నూరిపోస్తూ, మతం పేరుతో అసహనం పెరిగిపోయి దళితులపై, ముస్లిం మైనార్టీ లపై, మహిళలపై దాడుల కు పాల్పడుతున్నారని వారు అన్నారు. బిజెపి ప్రభుత్వం NAC లాంటి చట్టాలు తెచ్చి విభజించి పాలిస్తుందని, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండానే కాశ్మీరు రెండుగా చీల్చిందని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు అయోధ్య రామ రాజ్యం అంటూ హింసను ప్రేరేపిస్తూ చిచ్చు రేపుతున్నరని ఇది మానవ మనుగడకే ప్రమాదం అని బోధించారు. బడా కార్పొరేట్లు అయిన ఆదాని, అంబానీలకు భారత దేశ సంపద తాకట్టుపెట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే కుల మత గొడవలు సృష్టిస్తూ, వ్యవసాయ నల్ల పట్టాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తూ , కార్మిక చట్టాలు రద్దు చేసి e4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చారని, దీంతో కార్మికులు సుదీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతున్నారవి, ఇది ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో భాగమేనని, కార్పొరేటీకరణకు రెడ్ కార్పెట్ పరచడమేనని వారు అన్నారు. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో పోడు భూములను ఫారెస్ట్ వారు పోలీసుల అండతో ఆక్రమించుకుంటున్నారని, పోడు భూములు కాపాడుకునేందుకు పోరాడాలని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అర్థం చేసుకొని ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ తెలంగాణ ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ విద్యార్ధి, యువకులు, మేధావులు అందరూ ఒకటై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులు ముందు *50 సంవత్సరాల ఉద్యమంలో ప్రజల కోసం పని చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరుల సంతాప తీర్మానాన్ని మోరా రవి ప్రవేశపెట్టారు*. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కామ్రేడ్ సత్యనారాయణగారు, జక్కుల రాంబాబు, బండ్ల వెంకటేశ్వర్లు , వైయస్ రెడ్డి, వీరమల్ల ఉమా, రమా, వంకా సురేష్, మీడియం రాజు , సవళ్ల ఆదినారాయణ, తాటి తిరుపతయ్య, కుంజం బద్రు, నాగరాజు ,కోటేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: