CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

Share it:


  దమ్మపేట మే 27 ( మన్యం మనుగడ ) : అధిక ధరలు నిరుద్యోగం పై దమ్మపేట లో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు సిపిఐ ఎంఎల్ ప్రజా పందా జిల్లా నాయకురాలు తోలేం దుర్గ సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు మాట్లాడుతూ 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారాలను మోపుతున్నాయి కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన ఇంకా కోలుకొని ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువులు పెంచుతూ మూలిగే నక్కపై తాటిపండు పడ్డటు తయారయిందని తక్షణమే పెంచిన నిత్యవసర వస్తువుల రేట్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ .బస్ చార్జీలు. తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో దమ్మపేట తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది అలాగే పెట్రోల్ డీజిల్ పై కేంద్రం విధించిన అన్నిరకాల సెస్సు లను రద్దు చేయాలి ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు తగ్గించాలి. పెంచిన వంట గ్యాస్ ధర తగ్గించాలి.

నిత్యావసర లు.బట్టలు చెప్పుల పై జిఎస్టి ని తగ్గించాలి స్టీలు సిమెంటు ఇసుక ధరలను అదుపు చేయాలి. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలి. దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు నెలకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఐదువేల రూపాయలు ఇవ్వాలి. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ .ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి అని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: