CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం.ముఖ్య అతిధిగా పాల్గొన్న జడ్పీటిసి పొశం నర్సింహారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని మణుగూరు జడ్పిటిసి పోశం నర్సింహరావు అన్నారు.శనివారం మణుగూరు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహశీల్దార్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ముస్లిం సోదరుల దుస్తుల పంపిణీ కార్యక్రమాని జడ్పిటిసి పోశం ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ముస్లింలు అత్యంత నియమ నిష్టలతో రంజాన్ పండుగను జరుపుకొంటారని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ముస్లింలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా టిఆర్ఎస్ ప్రభుత్వం పండుగ లకు ప్రాధాన్యత ఇస్తూ, హిందువులకు బతుకమ్మ చీరలు,క్రిస్మస్ క్రిస్టియన్లకు, పేద ముస్లింలకు రంజాన్ కానుకులు అందించడంతో పాటు, మైనార్టీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని,మైనార్టీ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు.అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందన్నారు.రంజాన్ పండుగను సోదరభావంతో ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు.ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వర్ రావు, కో-ఆప్షన్ జావిద్ పాష,సమితి సింగారం సర్పంచ్ లు బచ్చల భారతి,సర్పంచ్ ఏనిక ప్రసాద్, మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి.హబీబ్,ముస్లీం మత పెద్దలు ముస్తాఫా,ఇస్మాయిల్, సిరాజ్,ఖుద్దూస్, ఎక్స్ లెంట్ యూసఫ్,రహీంపాష తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: