CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం:రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా

ఈరోజు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కరకగుడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అనంతరం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని కరకగూడెం గ్రామ పంచాయతీలోని SC కాలనీ లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మే 6వ తేదీన టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో జరిగినటువంటి రైతు సంఘర్షణ సభకు హాజరైన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో విడుదల చేశారు అన్నారు. అలాగే ఏక కాలంలో రూ 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతుకు భూమి లేని కౌలు రైతుకు ఎకరానికి 15000 పంట పెట్టుబడి సహాయం, భూమి లేని వ్యవసాయ కూలీకు ఏట రూ 12 వేల సహాయం,సొంత ఇంటికలకు రూ 5,00,000, వరికి రూ 2500, మొక్కజొన్నకు రూ,2200 లు, మిర్చి కి రూ,15000 మద్దతు ధరలు,అదేవిధంగా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వ్యవసాయానికి ఉపాధి పనులు అనుసంధానం చేయటం జరిగిందన్నారు. ఈ మేనిఫెస్టోను రైతులకు,మహిళలకు వివరించారు.తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓట్ వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ రైతులకు,పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ గారు,కరకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె రామనాథం, బట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు ,మాజీ ఎంపిటిసి దుర్గం సంజీవ,మండల నాయకులు బైరి శెట్టి రామరావు ,కోరగట్ల విశ్వనాథం,పోలేబోయిన సీతారాంబాబు గారు,దామోదర్, చెన్నూరి రవీంద్ర ,లక్ష్మయ్య ,నర్సింహా రావు,యువజన నాయకులు కిరణ్,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: