CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.దేవుడు అన్యాయం చేసినా.ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేస్తుంది. .

Share it:


 • కాలిపోయిన చోటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం డబ్బులిస్తాం.
 • నిర్మాణ్ సంస్థ ద్వారా కేసిఆర్ పేరు మీద మోడల్ కాలనీ ఏర్పాటు చేస్తాం. 
 • అగ్గిపాలయిన సర్టిఫికెట్లు అన్ని తిరిగి తెప్పిస్తాం.
 • అధైర్యాన్ని వీడండి,ధైర్యంగా ఉండండి. 
 • మీకు కావాల్సిన తాత్కాలిక,శాశ్వత వసతులన్నీ కల్పిస్తాం. 
 • గిరిజన సంక్షేమం నుంచి నస్టపోయిన వారికి 25వేల రూపాయల ఎక్స్ గ్రేషియా. 
 • రెవెన్యూ శాఖ నుంచి 15వేల రూపాయల ఎక్స్ గ్రేషియా.
 • మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రతి మహిళకు, పిల్లలందరికీ 10వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం. 
 • 18 నుంచి 30 సంవత్సరాలు నిండిన వారికి కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం.
 • ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. 
 • దాతల చేయుత,ప్రజా ప్రతినిధుల తోడ్పాటు, ప్రభుత్వం అండ ఉంది.
 • జరిగిన అన్యాయం పూడ్చే విధంగా అంతకు మించిన మేలు చేస్తాం.
 • ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట అగ్రిప్రమాద గుడిసె బాధితులను అక్కున చేర్చుకుని అమ్మలా ఓదార్చిన.
 • రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మన్యం మనుగడ ములుగు

అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదివారం ములుగు జిల్లా,మంగపేట మండలం, శనిగకుంట గ్రామ గిరిజనులను ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తో కలిసి పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు.సర్వం కోల్పోయి దు:ఖిస్తున్న మహిళలు, పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఏడవాల్సిన అవసరం లేదని ఊరడించారు.కాలిపోయిన గుడిసె,గుడిసె ప్రాంతానికి వెళ్లి ఆ కుటుంబ బాధలు విన్నారు. ఇంత అన్యాయం జరిగినందు కు అంతకు మించిన మేలు చేస్తామని ధైర్యం కల్పించారు. 

తెలంగాణ ఉద్యమ సమయం లో కూడా ములుగు లో అగ్ని ప్రమాదంలో గిరిజన కుటుంబం ఇళ్లు కాలిపోయి,పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అంతా దగ్దం కావడంతో బోరునవిలపిస్తుంటే

ఉద్యమ నాయకుడిగా ఆనాడు కేసిఆర్ తీవ్రంగా చలించి, ప్రభుత్వం వచ్చాక పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణ లక్ష్మీ తీసుకొచ్చారని,దీనివల్ల ఎంతో మంది లబ్ది పొందుతున్నారని చెప్పారు.ఇక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగి గుడిసెలు కాలి, కూడబెట్టుకున్నదంతా మంటల్లో అగ్గిపాలు కావడం అత్యంత దురదృష్టకరం, విషాదకరమన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యాన్ని వీడి, ధైర్యంగా ఉండాలని,మీకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వారికి కావల్సిన వంట సామాగ్రి, నిత్యావసరాలు అందించారు.

గిరిజన సంక్షేమ శాఖ నుంచి నస్టపోయిన ప్రతి కుటుంబానికి 25వేల రూపాయలు,రెవెన్యూ శాఖ నుంచి 15 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామన్నారు.అదేవిధంగా మహిళా,శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రతి మహిళకు, పిల్లలం దరకీ 10వేల రూపా యల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్ధిక సాయాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నామ న్నారు.వీటితో పాటు తాత్కాలి క వసతుల కోసం వెంటనే ఒక్కో దానికి దాదాపు 7వేల రూపాయల చొప్పున షెల్టర్లు ఏర్పాటు చేశామని,ఉండడా నికి కావల్సిన వసతులు, భోజనం అందిస్తున్నామన్నారు. వీటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు కాలిపోయిన స్థలాన్ని చదును చేసి,గ్రావెల్ తో సమానం చేసి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకునేందుకు త్వరలోనే 3 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు.దీనికి సంబం ధించి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు.అంతే కాకుండా నిర్మాణ్ సంస్థ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో కేసిఆర్ పేరు మీద మోడల్ కాలనీ నిర్మించి ఇస్తామని ధీమా కల్పించారు.అగ్ని ప్రమాదంలో కూడబెట్టుకున్న దానితో పాటు పిల్లల సర్టిఫికేట్లు కూడా కాలిపోయాయని,వెంటనే వీరు చదివిన విద్యా సంస్థలతో అధికారులు సంప్రదించి,ఆ సర్టిఫికేట్లు అన్ని ఇప్పిస్తారని చెప్పారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యోగ నియామకాలు వేయ డంతో,ఉచిత కోచింగ్ కూడా ప్రారంభమైనందున ఇక్కడున్న ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఎకనామికక్ సపోర్ట్ స్కీమ్ కింద ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని రకాల సాయాన్ని వెంటనే అందించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నా మన్నారు.సత్య సాయి ట్రస్ట్,

ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ముందు కు వచ్చి బాధితులకు నిత్యావ సరాలు ఇస్తున్నందుకు ధన్యవా దాలు తెలిపారు.ఐటిడీఏ ద్వారా,పరుపులు,చీరలు,దోతులు,బెడ్ షీట్లు,మెత్తలు,

అవసరమైన ఇతర సామాగ్రిని బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు కొనసాగిం చాలని అధికారులను ఆదేశించారు.బాధిత కుటుంబాలు కుదుటపడి వరకు పునరావాస కేంద్రాలు కొనసాగించాలని అన్నారు.

అనంతరం వారికి ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రభుత్వం అందిస్తున్న భోజనాన్ని అందరితో కలిసి తిన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్న మంగపేట ఎస్ఐ తాహెర్ బాబాను శాలువతో ఘనంగా సన్మానించారు.జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఇన్చార్జి ఎస్పీ సురేందర్ రెడ్డి,ఓఎస్డీ శోభన్ కుమార్,ఏటూరు నాగారం ఏ ఎస్పి అశోక్ కుమార్,ఐటీడీఏ ఏపీవో వసంతరావు,ఐ టి డి ఎ ఇఇ హేమలత,డి ఈ నవీన్ కుమార్,ఆర్డిఓ రమాదేవి,

డిఎంహెచ్ఓ అప్పయ్య,

ఐటిడిఎ మేనేజర్ లాల్,

ఎస్ఓ రాజ్ కుమార్,ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్, మంగపేట,ఏటూరునాగారం తెరాస పార్టీ మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: