మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భద్రాచలం లోని శ్రీ సీతారాముల ఆలయానికి భారత్ బయోటెక్ కంపెనీ భారీ విరాళాన్ని ప్రకటించింది.భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిత్యాన్నదానానికి రూ.కోటి రూపాయల విరాళాన్ని కంపెనీ యాజమాన్యం అందించింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయంలో ప్రతిరోజు అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని అందిస్తారు.ఈ నేపథ్యంలో భక్తులకు అన్నదానం కోసం భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు ఈ కోటి రూపాయల విరాళాన్ని స్వామి వారి ఖాతాలో జమ చేశారు.
Post A Comment: