CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వం తరపున శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయిస్తాం--:మంత్రి సత్యవతి రాథోడ్.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలంలోని శనిగకుంట ఆదివాసీ గూడెం అగ్నికి ఆహుతి అయిన సందర్బంగా రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జిల్లా జడ్పీ అధ్యక్షులు కుసుమ జగదీశ్, ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని సందర్శించి భాధితులను పరామర్శించి వారిని ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని తెలియజేశారు.మిమ్మల్ని ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అని తెలియజేశారు. అగ్ని ప్రమాద భాదితులకు ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయిస్తాము అని ప్రజలకు తెలియజేశారు. విద్యార్థులు కోల్పోయిన మెమోలు, సర్టిఫికెట్స్ అన్ని మరల ఇప్పిస్తాం అని తెలియజేశారు. భాదితులకు ఎటువంటి లోటు రాకుండ చూసుకుంటామని తెలియజేశారు. అధికారులు పునరావాస కేంద్రం లో అన్ని వసతులతో పాటు హెల్త్ క్యాంపు కంటిన్యూ చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదం సమయంలో అన్ని శాఖల అధికారులు అందరూ అందించిన సహకారం అద్భుతమని తెలియజేశారు, ఎస్ఐ తాహెర్ బాబా ఆధ్వర్యంలో పోలీస్, ఫైర్ అధికారులు చూపిన ధైర్య సాహసాలు ప్రశంస నీయమని ఈ సందర్బంగా తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: