CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పట్టా భూముల ఇసుక మేటలు అనుమతులను, గిరిజన సొసైటీ రేజింగ్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలి.మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప వీరయ్య.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం యాదయ్య అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మన్యసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ.ములుగు జిల్లా లోని మంగపేట,ఏటూరు నాగారం,కన్నాయిగూడెం, వాజేడు,వెంకటాపురం మండలంలోని పట్టా భూములలో ఇసుక మేటల అనుమతులను రద్దు చేయాలని,కాంట్రాక్టు పద్ధతి రద్దు చేయాలని,షెడ్యూల్ ఏరియా ఇసుక క్వారీలకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. అలాగే పట్టా భూములలో డైరెక్ట్ లోడింగ్ ఇవ్వడం వలన గిరిజన సొసైటీ క్వారీలకు ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. తెలంగాణ మైనింగ్ యాక్ట్, మైనింగ్ జిఓ 3 ప్రకారం నాన్ షెడ్యూల్ ఏరియా అనేది లేదు అని ములుగు జిల్లా లో షెడ్యూల్ ఏరియాగా మైనింగ్ జీవో మూడు ప్రకారం అన్ని గ్రామాలు షెడ్యూల్ ఏరియాగా గుర్తించారని అన్నారు.1/58-1/70 పెసా చట్టం,గిరిజన చట్టాలకు విరుద్ధంగా తప్పుడు అనుమతులు ఇస్తున్నారని, పట్టా భూమి కి గాని గిరిజన సొసైటీకి గాని గ్రామ సభల తీర్మానాలు లేకుండా,ప్రతి క్వారీ కి గ్రామ సభలు తప్పకుండా ఉండవలసిందే అని అన్నారు. చుంచుపల్లి ఇసుక క్వారీ కి ఎలాంటి గ్రామసభ పెట్టకుండా, జిల్లా కలెక్టర్ కు తప్పుడు గ్రామసభ తీర్మానం ఇవ్వడం వలన ఇసుక క్వారీ నిర్వహించుకుంటున్నారని, ఏటూరు నాగారం,వాడ గూడెం,రాజుపేట,వాజేడు, వెంకటాపురం లో నడుస్తున్న ఇసుక క్వారీ లన్ని కూడా గిరిజన చట్టాలకు,గ్రామ సభ తీర్మానాలు లేకుండా విరుద్ధంగా,తప్పుడు గ్రామసభ సభ తీర్మానాలతో నడుస్తున్న ఇసుక క్వారీలను వెంటనే రద్దు చేయాలని మన్య సీమ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కావేరి అర్జున్,ములుగు జిల్లా అధ్యక్షుడు ఈసం రాజు,జిల్లా నాయకులు కొర్ని బెల్లి విష్ణు, ఈసం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: