CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పథకాన్ని వినియోగించుకోవాలి.గ్రామీణ మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వ రాయితీలు

Share it:


  • జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం మనుగడ, మంగపేట.

భారత ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం పిఎం ఎఫ్ యం ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటీర పరిశ్రమల స్థాపకులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు.గురువారం వరంగల్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిర్చి ప్రాసెసింగ్ ప్యాకేజీ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ పై నిర్వహించిన ప్రదర్శన కు ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ పి ఎం ఎఫ్ ఎం ఈ పథకం చాలా బాగుందని ఈ పథకం ద్వారా ఒక లబ్ధిదారుడు గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేస్తుందని యూనిట్ ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుండగా పది శాతం లబ్ధిదారుని వాటాగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఒన్ డిస్ట్రిక్ట్ ఒన్ ప్రొడక్ట్ పథకానికి అనుగుణంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో మిర్చి మినీ ప్రాసెసింగ్ యూనిట్లు విరివి గా మంజూరు చేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని రైతు ఉత్పత్తి సంఘాలు స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.అనంతరం మిర్చి ప్రాసెసింగ్ కు సంబంధించిన ఆధునిక యంత్ర పరికరాలను రైతు ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి సాంబశివరెడ్డి పరిశీలించారు. ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు వ్యవసాయ పరిశోధనా స్థానం ములుగు రోడ్డు లో నిర్వహిస్తున్న యంత్ర పరికరాల ప్రదర్శనను రైతులు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు తిలకించి అవగాహన పొందాలని పి ఎం ఎఫ్ ఎం ఈ పథకంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతినిధులు రంజిత్ ఉపేందర్, స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి.లింగప్ప,వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఆవర్ పుడ్ ప్రతినిధులు ఎన్జీవో ప్రతినిధులు,డ్వాక్రా మహిళలు, పోతన ఎన్జీవో ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, రామప్ప రైతు సేవ య పిఓ ప్రెసిడెంట్ నరెడ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: