CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బండి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అమిత్‌ షా సభ.. తేడా వస్తే ఇక అంతేనా..!

Share it:

 



బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ దిశగా కొనసాగుతుంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతొ బండి సంజయ్ చేస్తున్న యాత్రకి ప్రజల నుండి స్పందన అంతంత మాత్రమే. దీంతో బండి పాదయాత్రతో తెలంగాణలో బీజేపీ స్థాయి మారిపోతుందని భావించిన బీజేపీ ఆశలన్నీ అడియాశలే అవ్వటంతో ఇప్పుడు పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. ఈ నెల 14న యాత్ర ముగియనుండటంతో బండి సంజయ్ పెద్ద ఎత్తున సభ పెట్టాలని భావిస్తున్నాడు. ఈ ముగింపు సభకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని తీసుకొస్తున్నారు. దీంతో అమిత్ సభకి భారీఎత్తున జన సమీకరణ చేయాలని బండి సంజయ్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో అంటే హిందూ ముస్లిం అంటూ రెచ్చగొట్టి కాస్త జనాన్ని పోగేసుకునే బీజేపీకి.. మత విద్వేషాలు లేని తెలంగాణ పల్లెల్లో సాధారణ స్థాయిలో కూడా కార్యకర్తలు ఉండరు. దీంతో అమిత్ షా సభకి జనాలని ఎలా పోగేయల్లో అర్థంకాని పరిస్థితి.


ఈ నెల 5న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో నిర్వహించిన సభకు కూడా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆ మరుసటి రోజే వరంగల్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సభకు డబ్బులు పెట్టి బాగానే జనాలని తరలించారు కాంగ్రెస్ సీనియర్స్. దీంతో నడ్డా సభ కంటే రాహుల్ మీటింగ్ కి జనాలు ఎక్కువగా రావటంతో బండి సంజయ్ పై బీజేపీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకే పరిమితమైన బండి యాత్రకు జిల్లా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో అమిత్‌ షా సభ కోసం నాయకులందరికీ బండి టార్గెట్లు పెట్టారు. రాష్ట్రంలోని ప్ర‌తి పోలింగ్‌ బూత్‌ నుంచి కనీసం 10–20 మంది, మండలాల నుంచి వెయ్యి నుంచి ఐదు వేల వరకు, హైదరాబాద్‌ సమీప జిల్లాలు, మండలాల నుంచి 5–10 వేల చొప్పున జన సమీకరణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇక్కడే మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. కొన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి నేతలకే దిక్కు లేదు. అలాంటిచోట బూత్‌ అధ్యక్షులు ఎలా ఉంటారని, వారు 20 మందిని ఎలా తీసుకొస్తారని పార్టీలో చర్చించుకొంటున్నారు.

Share it:

TS

Post A Comment: