CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.....

Share it:


  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటి డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి
  •  బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వరాల జల్లు... 
  • రూ" డబ్బై ఐదు వేల విలువైన వస్త్రాల పంపిణి
  • రూ" లక్ష విలువైన టార్పాలిన్ పరదాల పంపిణీ 
  •  వచ్చే వర్షాకాలం పంట కి వంద ఎకరాలకు ఉచితంగా వరి సీడ్ విత్తనాల పంపిణీ చేస్తామని హామీ.

మన్యం మనుగడ, మంగపేట.

ఇటీవల మండలంలోని శనిగకుంట గ్రామంలో అగ్నికి ఆహుతి అయిన కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు శుక్ర వారం ఆయన వికాస్ ఆగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికాస్ ఫెర్టి లైజర్స్ అకినేపల్లి మల్లారం భాగ్యశ్రీ ఫెర్టి లైజెర్స్ జానంపేట వికాస్ అగ్రీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ మరియు దాత నాశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి సంయుక్త సహకారంతో రూపాయలు డెబ్బై ఐదు వెయిల విలువైన నూతన వస్త్రాలను బాధిత కుటుంబాలకు సాంబశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరగటం విచారకరమన్నారు.బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపాయలు మూడు లక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు ఇందులో భాగంగా ఇప్పటికే తక్షణ పునరావాసం కోసం రూపాయలు లక్ష విలువైన నలభై టార్ఫాలిన్ పరథాలను ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క చేతుల మీదగా ఆదివారం మే ఒకటో తేదీన పంపిణీ చేయడం జరిగిందని ఈ పరదాలను పునరావాసం తో పాటు బాధిత కుటుంబాలు కుదుటపడిన తర్వాత తమ వ్యవసాయ అవసరాలకు సైతం ఉపయోగపడేలా పంపిణీ చేసినట్లు వివరించారు ఈరోజు రూపాయలు డెబ్బై ఐదు వేల విలువైన బట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు, అంతేకాకుండా వచ్చే వానాకాలం పంట కి బాధిత కుటుంబాలకు చెందిన గిరిజన రైతుల కోసం వరంగల్ లోని అన్నపూర్ణ సీడ్స్ అండ్ ఫామ్స్ పూర్తి సహకారంతో వంద ఎకరాలకు సరిపడా రూపాయలు లక్ష విలువైన వరి విత్తనాలను ఉచితంగా జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అగ్ని ప్రమాద బాధిత రైతు కుటుంబాల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు విత్తనాలతో పాటు వరి నారు యాజమాన్యం కోసం రూ 25,000 విలువైన సూక్ష్మ పోషక ఎరువులను ఉచితంగా అందజేస్తామని అంతేకాకుండా వెనుకబడిన శనగకుంట గ్రామంలో నూతన వ్యవసాయ పద్ధతులపై సాంకేతిక సహకారాన్ని సైతం అందిస్తామని తెలిపారు వరి సాగుకు అవసరమైన విజేత సాంబమసూరి కమల మొదలగు వరి వంగడాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఆపన్న సమయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే బాధిత కుటుంబాలకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అని అన్నారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు భాగ్యశ్రీ ఫెర్టిలైజర్స్ యజమాని పచ్చిపులుసు నరేష్,నాశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,పెండ్యాల హరి, వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు, ప్రసాదు శనగ కుంట గ్రామం యువత మరియూ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: