CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోపాల రావు పేట అక్రమ ఇసుక ర్యాంపు పై చర్యలు తీసుకోవాలి.అనుమతులు ఒకచోట- తవ్వకాలు మరొకచోట.

Share it:

 





  • గోపాలరావు పేట ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలు
  • పినపాక గ్రామానికి పొంచి ఉన్న ప్రమాదం
  •  అడ్డుకున్న పినపాక గ్రామస్తులు


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాల రావు పేట కు సంబంధించిన ఇసుక ర్యాంపు అక్రమానికి అడ్డా అని, అనుమతి లేని చోట తవ్వకాలు చేస్తూ సహజ సంపదలను కొల్ల గొడుతున్నారు అని వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు గురువారం నాడు గోపాలరావు పేట ఇసుక ర్యాంపు గురించి, జరిగే అక్రమాల గురించి వివరించడం జరిగింది. ఇసుక మేటలు వేసిన ప్రాంతాన్ని ప్రభుత్వం త్రవ్వకాలకు అనుమతించిందని, కానీ ఆ ప్రాంతాన్ని వదిలేసి సంబంధంలేని ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ప్రజాప్రతినిధుల ఆరోపణ. బినామీ వ్యక్తుల పేరు మీదుగా ఇసుక ర్యాంపును నడుపుతూ, రైజింగ్ కాంట్రాక్టర్ పట్టా భూములలో మేట వేసిన ఇసుకను తీయకుండా, అక్రమ దందా చేస్తున్నారని ఆరోపించారు. గోపాలరావుపేట, పినపాక గ్రామాల మధ్య ఉన్న చెరువు లోకి ఇసుక తవ్వకాల కారణంగా రాబోయే వర్షాకాలంలో పెద్ద వాగు నీరు వచ్చే ప్రమాదం ఉందని తెలియజేశారు. అధికారుల డొల్లతనం స్పష్టంగా కనబడుతుంది అని, టి ఎస్ ఎం డి సి అధికారుల పర్యవేక్షణ శూన్యం అని తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక ర్యాంపు వ్యక్తులపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని పినపాక గ్రామానికి చెందిన పలువురు ప్రజానీకం డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: