CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల సమస్యలపై తాహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఏ ఐ కె ఎస్ ఆధ్వర్యంలో ధర్నా..

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 13 మండలంలో పలు గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం ఏ ఐ కె ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యల పై మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించి, మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో సాగు భూములకు పట్టాలు లేవని, 69 కంటే ముందే ఈ ప్రాంతం భూములు వదిలిపెట్టి వెళ్లిన నేటికీ పట్టాదారులు గా కొనసాగుతూ, సన్న చిన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందడం లేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆయన అన్నారు. అలాగే మండలంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల కి వందల ఎకరాలు పట్టాలు అవుతున్నాయి. కానీ సామాన్య చిన్న, సన్నకారు రైతులకు పట్టాలు కావట్లేదని, ఈ పద్ధతి ఇలానే కొనసాగితే ఇవాళ ధర్నా చేసిన రైతు సంఘమే మండలంలోని రైతాంగాన్ని కదిలించి ముద్రితమైన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ధర్మ పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో అనేక ఏళ్లుగా ఎకరం, రెండు ఎకరాల భూములు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రైతాంగానికి నేటికీ ఇల్లు లేవని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు భూక్య వీరభద్రం మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో సర్వే నిర్వహించి రైతాంగ సమస్యల పై ధర్నా నిర్వహిస్తున్న తెలంగాణ రైతు సంఘం ధర్నాకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ఈ రోజు గ్రామాలలో అనేక ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రైతులకు పట్టాలు లేవని అలాగే మండల వ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ దళిత బంధు ఇవ్వాలని, వేలాది ఎకరాల్లో చెట్టు, పుట్ట కొట్టుకొని జీవనం సాగిస్తున్న పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరం సత్యనారాయణ, రైతు సంఘం మండల నాయకులు గడిదేశి కనకరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాసా నరేష్, వ్యవసాయ కార్మీక సంఘం జిల్లా నాయకురాలు పద్దం సుగుణ, రైతుసంఘం నాయకులు భూక్య బిచ్చు, ధరావత్ వేణు, బొల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: