- పిఎంపి,ఆర్ఎంపి,డాక్టర్ అని సూచిక బోర్డులు కనిపించిన కూడా కేసులు నమోదు చేస్తాం.
- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతి కుమార్.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ప్రైవేటు వైద్యం అర్హత లేని పిఎంపి, ఆర్ఎంపీ,డాక్టర్ అని క్లినిక్ లేదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను సూచిక బోర్డులపై రాసుకొని ఉండడం గమనించడం జరిగిందని డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ కోరం క్రాంతి కుమార్ అన్నారు.ఏజెన్సీ గ్రామాల్లో పి.ఎం.పి,ఆర్.ఎం.పి డాక్టర్లు అని చెప్పుకుంటూ అమాయక గిరిజనులకు వైద్యం చేయడం సెలైన్లు పెట్టడం, అధిక మోతాదులో మందులు వాడడం,రక్త పరీక్షలు చేయడం,ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు.అర్హతలేని పి ఎంపీలు,ఆర్ఎంపీలు పేషెంట్లకు కేవలం ప్రథమ చికిత్స అందించాలని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన మండలాల తాసిల్దార్ దార్లకు,గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది అని గిరిజన ప్రజలను మోసం చేస్తూ తమ పేర్లముందు డాక్టర్ అని పెట్టుకొని వైద్యం చేస్తున్న వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.
Post A Comment: