మన్యం మనుగడ, పినపాక:
ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనగ కుంట అగ్నిప్రమాద బాధితులకు టీఎస్ జెన్కో డీ ఈ లు 25 వేల రూపాయల నిత్యవసర వస్తువులు, పదివేల రూపాయల బట్టలు అగ్నిప్రమాద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీ ఈ రాందాస్, డీ ఈ చక్రపాణి మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోవడం చాలా బాధాకరం అని, ప్రభుత్వమే కాకుండా ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వీరిని ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్న తాము విషయం తెలుసుకొని అగ్నిప్రమాద బాధితులకు సహాయం అందించడం చాలా ఆనందంగా ఉందని, సంతృప్తిని వ్యక్తం చేశారు, ప్రమాద బాధితులకు సహాయం అందించినందుకు గాను ములుగు ఎమ్మెల్యే సీతక్క జెన్ కో డీ ఈ లను అభినందించారు.
Post A Comment: