మన్యం టీవీ మణుగూరు
ములుగు జిల్లా,మంగపేట మండలం,శనగ కుంట గ్రామం లో ఇటీవల అగ్ని ప్రమాదం లో ఇల్లు కాలిపోయి,సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన కుటుంబాలకు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు పట్టణానికి చెందిన వేణు
రెస్టారెంట్ యజమాని లక్కం లక్ష్మీనారాయణ,శ్రీ దుర్గ పెస్టిసైడ్స్ యజమాని పోశం సత్యనారాయణ,శ్రీలక్ష్మి స్టీల్స్ యజమాని వాసు,మణుగూరు ట్రాలీ ఆటో అసోసియేషన్ అధ్యక్షులు కోరట్ల సమ్మయ్య, మణుగూరు ట్రాన్స్కో ఏడీఈ జీవన్ కుమార్ ల ఆధ్వర్యంలో సోమవారం రూ.40 వేల విలువ గల నిత్యావసర సరుకులు, బట్టలు,బకెట్లు,బియ్యం, కూరగాయలు వితరణ గా అందజేశారు.మణుగూరు బిటిపిఎస్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ పుప్పాల రవీందర్ రావు చేతుల మీదుగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు,బట్టలను అందజేశారు.ఈ కార్యక్రమంలో లక్కం లక్ష్మీనారాయణ,పోశం సత్యనారాయణ, కోరగట్ల సమ్మయ్య,సంతోష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: