CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శనగ కుంట గ్రామ అగ్నిప్రమాద బాధితులకు న్యూడెమోక్రసి చేయూత.

Share it:

 



మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం శనగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలోఆదివాసీ గూడెం అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయిన నేపథ్యంలో ఆదివారం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు 150 చీరలు, 40 దుప్పట్లు, 40 లుంగీలు,40 కండువాలు చిన్న పిల్లలకి బట్టలు క్వింటా ఉల్లిగడ్డలు, సబ్బులు,40 కేజీ ల మంచినూనె వంటసామాన్లు అందించారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి ఎన్ని రోజులైనా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. స్పందించి అగ్నిప్రమాద బాధితులకు తక్షణమే ఆరునెలల పాటు జీవించడానికి ఆర్థిక సహకారం అందించాలని అలాగే రెండు పడకల ఇల్లు మంజూరు చేసి శాశ్విత గృహ సదుపాయంకల్పించాలని గ్రామంలో విపరీతమైన మంచినీటి కొరత ఉందని ఈ మంచినీటి కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంలో లక్షలాది రూపాయలు కోల్పోయి పూర్తిగా నిర్వాసితులయ్యారనీ ఇంటిలో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు భూమి పట్టాలు కాలిపోయాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి కొత్త కార్డులు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. అలాగే బ్యాంకు రుణాలన్నీ రద్దు చేసి ఇ ప్రతి ఒక్కరికి నూతన రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నర్సింహా రావు, గుండాల మండల నాయకులు యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, లాలు, గుండాల ఉప సర్పంచ్ ఉపేందర్ మాజీ ఎంపీటీసీ ఈసం మంగన్న, వెంకన్న, అశోక్, నరేష్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: