CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత..

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత పది రోజు లుగా గ్రామ గ్రామాలలో సర్వే నిర్వహించి సమస్యలు పరి ష్కరించాలని బుధవారం మండల కేంద్రంలో ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం స్థానిక తాసిల్దార్ రవీందర్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మ వెంకటరెడ్డి,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు బీరెడ్డి సాంబశివ మాట్లాడుతూ.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమ య్యారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పక్కదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగా గత సంవత్సరం కేటాయించిన నిధుల కంటే ఈసారి బడ్జెట్లో 25 వేల కోట్ల రూపాయలు తగ్గించారని,అదే క్రమంలో ఆన్లైన్ సిస్టం తీసుకొచ్చి కూలీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని,సమ్మర్ అలవెన్స్ కోత విధించారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంను బంగారు తెలంగాణ గా చేస్తాం అని చెప్పి ఆచరణలో బాధల తెలంగాణ గా మార్చిందన్నారు.ఆక్రమంలో

నే పేద ప్రజలందరికీ రెండు గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మభ్య పెడుతుంన్నారని,మండలంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని,అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకుండా వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు ను చాలా ఇబ్బందులు పడుతున్నారని,వితంతువులు, 12 సంవత్సరాలు అయినా వారికి పింఛను ఇచ్చే పరిస్థితి లేదు,కానీ ప్రభుత్వం మాత్రం మీ అందరికీ పింఛన్లు ఇస్తు న్నామని మాటలు చెప్తుందిని అన్నారు.ఇది దుర్మార్గమని వారు అన్నారు.2014 తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, పుట్టిన వారికి రేషన్ కార్డు లేక పోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, అదే క్రమంలో మండలంలో మంచినీటి సమస్య తోని, పోడు భూములకు పట్టాలు రాక పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పట్టాలు

ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని,మరొకవైపు ఫారెస్ట్ అధికారులు పోడు దారులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని,అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం మండలం లో అనేక గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని,ఈ సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఇలాంటి అనేక సమస్యలతో ని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజల మీద సవతి తల్లి ప్రేమ చూపుతుంది. ఈ సమస్యలు పరిష్కరించక పోతే భవిష్యత్తులో ప్రజాసం ఘాల,ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని వాళ్లు అన్నారు.ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్,రైతు సంఘం నాయకులు బండారి నరసింహులు,యాకూబ్ పాషా,ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తోలెం కృష్ణయ్య,సి ఐ టి యు నాయకులు,నాయిని కృష్ణ, సంజీవ, బైరబోయిన విష్ణు,

గోగు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: