CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రెండు జిల్లాల రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బచ్చయ్య ,టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సమావేశం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

20వ శతాబ్దాల చరిత్ర కలిగి, రెండో యాదగిరిగుట్ట గా ప్రసిద్ధిగాంచిన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు దాతలు తమకు తోచిన విధంగా ఆలయ పునరుద్ధరణ కమిటీ, దేవాదాయ శాఖకు తోచిన విధంగా సాయం అందించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలి. ఆలయానికి గత కొన్ని సంవత్సరాలుగా అనివార్య కారణాలవల ఆలయ పాలక మండలి ఏర్పాటు నిలిచిపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ చోటుచేసుకుంది. దీనిలో భాగంగా హేమాచల క్షేత్రాన్ని మరో యాదగిరి గుట్ట గా తీర్చి దిద్దేందుకు కెసిఆర్ కల్పించారన్నారు. దీనికోసం ఆలయానికి పునరుద్ధరణ కమిటీని నియమించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం సహకారం అందించే భక్తులు దాతలు పాలక మండలి ఆధ్వర్యంలో విరాళములు అందించి దేవాదాయ శాఖ ద్వారా తగిన రసీదు తీసుకోవాలి. పాలకమండలి ప్రమేయం లేకుండా దాతలు ఎవరు కూడా ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చే విరాళాలను ఆలయ పునరుద్ధరణ కమిటీ సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులకు చెల్లించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు,పల్లా బుచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, ఆలయ పునరుద్ధరణ చైర్మన్ నుతిలకంటి ముకుందం, చిట్టిమల్ల సమ్మయ్య, ఆలయ డైరెక్టర్లు, గాదె శ్రీనివాస్ చారి,తొలెం నర్సింహారావు, ఉసం శ్రీను,సురేందర్,సాంబశివరావు, యూగేందర్,నూనె పద్మ,రాజేష్,ఆదినారాయణ, రామకృష్ణ,సాంబయ్య,బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కుదురుపకు చిట్టిబాబు,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,, తిమ్మపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్,నర్సింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ ,ముగల రమేష్,జాడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: