CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పక్క రాష్ట్రం రైతుల మీద ఉన్న ప్రేమ మన రైతుల మీద లేదు.రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు చరమ గీతం పాడాలి

Share it:


  • ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పేద ప్రజలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
  • నిరుపేదలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలి
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండలం లోని పూరెడు పల్లి, బుచ్చం పేట

నర్సాయిగూడెం, రచ్చ బండ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్...పార్టీనీ ఆదరించండి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో రైతులకు కెసిఆర్ చేసింది ఏమి లేదని, 

ఎన్నికల సమయం లో ఏక కాలములో రైతు రుణమాఫీ చేస్తా, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇస్తానని, దొంగ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కెసిఆర్, వరి వేస్తే ఉరి అనే పరిస్థితి తీసుకువచ్చే దుస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రం లో ఉందని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగు పడ్డ చరిత్ర లేదని, ముఖ్య మంత్రి కెసిఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు,తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆదరించాలి. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ.

 ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు.

 ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు. రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటాం, ధరలు ముందే నిర్ణయం మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం మెరుగైన పంటల భీమాను తీసుకోస్తాం, రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తాం. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు.ధరణి పోర్టలును రద్దు చేస్తాం. మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తాం. నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడి యాక్టు పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం.. చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం.

 రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్.

వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని సీతక్క తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం.

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆదరించాలి, అసమర్థ బిజెపి, టి ఆర్ ఎస్ పార్టీల పాలన కు చరమ గీతం పాడాలని సీతక్క రైతులను ఉద్దేశించి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,చిటమట రఘు,ఉమ్మడి జిల్లా కార్యదర్శి పూజారి సురేందర్ బాబు జిల్లా యూత్ కార్యదర్శి మంగపేట మండల సోషల్ మీడియా ఇంచార్జ్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలక మర్రి శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు అయ్యోరి యనయ్య, తుడి బాగ్ వాన్ రెడ్డి, కొంకతి సాంబ శివ రావు,

బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తి నేని ఆధి నారాయణ,

ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చద మల్లయ్య, మైప లాలయ్య

దికొండ కాంతా రావు, బాలకృష్ణ

వావిలాల చిన్న ఎల్లయ్య, వాలిలాల నర్సింగ రావు,గుడ్ల దేవేందర్, పెద్ది నర్సింగ రావు,

చెట్టు పెల్లి వెంకటేశ్వర్లు, ఎట్టి సారయ్య, గాదె శ్రవణ్, బొడ బోర్రయ్య,ఏర్రం గారి సురేష్

ఆకు పవన్,తోట అశోక్,

తోలెం నాగబాబు,ఎట్టి సమ్మయ్య, జలాల్, సత్తమ్మ

బండారి శ్రీను, లోకు సత్యం

గూడూరు రామ్మూర్తి,లక్ష్మయ్య,

సరిగొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: