CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలి!.న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి

Share it:


మన్యం మనుగడ, ములకలపల్లి:

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచి, కనీస వేతనం రోజుకు 600 ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మోరా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామం, శ్రీరామ చెరువు వద్ద ఉపాధిహామీ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచి ఉపాధి హామీ కార్మికులకు రోజు వేతనం 600 చెల్లించాలని, 10వ తరగతి ఆ పైన చదువుకొని ఉపాధి హామీ పని చేస్తున్న వారిని గుర్తించి ఈ పథకంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఏదైనా ప్రమాదవశాత్తు మరణించిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి కోలుకునే వరకూ, గర్భిణీ స్త్రీలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగ పనులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని,కనీస సౌకర్యాలు కల్పించాలని పనిస్థలాల్లో టెంట్, మంచినీళ్లు, వైద్య సదుపాయం,పసిపిల్లలకు ఉయ్యాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ, వేతనాలను వారం వారం చెల్లించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంకై AIKMS నిర్వహించే దశాలవారి ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కూలీలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు , న్యూడెమోక్రసీ,AIKMS నాయకులు వంకా సురేష్ ,సవల్ల ఆదినారాయణ దుబ్బ వెంకటేష్, ఉపాధి హామీ కూలీలు నాగేష్ ,శ్రీను, మడిమ నాగేష్, భాస్కర్ ,సుజాత,గౌరమ్మ, రమణ, అలివేలు, స్వాతి ,అంజమ్మ ,సుజాత, కడియం సునీత, వంకా కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: