CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక శ్రమశక్తి అవార్డు గ్రహీత వుకంటి.ప్రభాకర్ రావు కు సహోద్యోగుల ఆత్మీయ సత్కారం

Share it:



  • శ్రమకు సమర్ధతకు పరోపకారి ప్రభాకర్ కు నిజమైన పురస్కారం.
  •  ముఖ్య అతిథిగా పాల్గొన్న బేస్ వర్క్ షాప్ ఇంచార్జ్ దాసరి రాజశేఖర్    ప్రశంస

మన్యం టీవీ మణుగూరు:


2022 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక శ్రమశక్తి అవార్డు అదివారం ఉదయం హైదరాబాదులో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకుని మణుగూరు తిరిగివచ్చిన సందర్భంగా అవార్డు గ్రహీత మణుగూరు ఏరియా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్ రావు కు రాజకీయాలకు అతీతంగా ఓసి -2 డంపర్ సెక్షన్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సహోద్యోగులు సెక్షన్లోని అన్ని విభాగాల కార్మికులు గురువారం ఉదయం డంపర్ సెక్షన్ ఆత్మీయ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. పుష్పగుచ్ఛాలు,శాలువాలు, పూల మాలలతో,మిఠాయిల తో ఆయన్ని ఘనంగా సత్కరించారు.అవార్డు అందుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు.డంపర్ సెక్షన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎం.రామ నరసయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,బేస్ వర్క్ షాప్ ఇన్ ఛార్జ్,దాసరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఒక కార్మిక సంఘం నాయకునికి గల లక్షణాలు,వాక్చాతుర్యం,నిజాయితీ,సమస్యను పరిష్కరించే తీరు,సమర్ధత,అందరికీ అందుబాటులో ఉండటం, రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవ చేయటం, సామాజిక సేవ,కుటుంబ బాధ్యత,సింగరేణి సంస్థ పట్ల చక్కని అవగాహన మంచి లక్షణాలతో ప్రభాకర్ అందనంత ఎత్తుకు ఎదగారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శ్రమశక్తి అవార్డు ప్రకటించడం పట్ల సమర్థతను ప్రోత్సహించడమేనని ఆయన ప్రశంసించారు.అవార్డు గ్రహీత తో పాటు అందరం ఆ సంతోషాన్ని ఆస్వాదించాలని, ప్రభాకర్ తోటి ఉద్యోగి కావడం తను తనతోపాటు పాటు ఓసి- 2 ఉద్యోగులు గర్వంగా భావించాలని కోరారు.సన్మాన గ్రహీత ప్రభాకర్ రావు మాట్లాడుతూ,తనకి అవార్డు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతగానో రుణపడి ఉంటానని,జన్మనిచ్చిన తల్లి దండ్రులకు,రాజకీయ గురువు పిచ్చేశ్వరరావు కు,తన అర్ధాంగి రాజేశ్వరికి,టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యులకు,తన విజయం వెనుక గల బ్రాంచ్ కమిటీల నాయకులకు సభ్యులకు,కార్యకర్తలకు, బంధు,మీత్రులకు,రాజకీయాలకతీతంగా తనను ప్రోత్సహిస్తున్న ఇతర కార్మిక సంఘాల నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, సింగరేణి ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అన్నం పెడుతున్న సింగరేణి తల్లిని తను ఏనాడు మర్చిపోనని శ్రమశక్తి అవార్డు తమ బాధ్యత ను మరింత పెంచిందని,ఇదే స్ఫూర్తితో సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు,కార్మికుల సమస్యల పరిష్కారానికి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మరింత చురుకైన పాత్రను పోషిస్తామని, ఆయన సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.ఈ కార్యక్రమంలో బేస్ వర్క్ షాప్ ఇంజనీర్లు ఈ.సతీష్, వెంకటేశ్వర్లు,సూపర్వైజర్లు,టి. సురేష్,కరుణాకర్,చారి,వెంకటేశ్వర్లు,డంపర్ సెక్షన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రామ నరసయ్య,కె వి రమణ రావు, ఎం వసంతరావు,డి. శ్రీనివాసరావు,కె.హనుమంతరావు,షేక్ అమిర్ పాషా, నాయకులు కోట శ్రీనివాస్,కాపా శివాజీ,నామ వెంకటేశ్వరరావు, చిట్టి వెంకటేశ్వర రెడ్డి,గ్లాడ్ స్టన్,నూనె భాస్కర్,టి శ్రీనివాస్,కె.పాల్,లక్ష్మణరావు,బుర్ర వెంకటేశ్వర్లు,బత్తుల శివాజీ,శేషగిరి,సామాజిక కార్యకర్తలు నాసర్ పాషా, ఉపేందర్,రవీందర్,రాజు,చారి,వెంకటేశ్వర్లు,రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: