CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ గిరిజన మహిళలను ఆదివాసీ సమస్యలను అడిగి తెలుసుకున్న జడ్పీటీసీ సున్నం నాగమణి.

Share it:


మన్యం మనుగడ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, బండారు గుంపు గ్రామంలో సున్నం నాగమణి జెడ్పీటీసీ ములకలపల్లి & టీపీసీసీ మెంబర్ గిరిజన మహిళలతో మాట్లాడి పలు గిరిజన సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములు కందకాలు తవ్వి, గిరిజన మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అటవీశాఖ అధికారులు సిబ్బంది గురించి మహిళలు తెలియపర్చటం జరిగింది. ఈ సందర్బంగా సున్నం నాగమణి మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతులందరికీ  కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వటం జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ప్రతి గ్రామంలో పర్యటించి గిరిజనులకు పోడు భూములు విషయంలో తాను అండగా నిలుస్తానని హామీ ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మొన్న  6వ తారీఖున  వరంగల్  రైతు సంఘర్షణ  సభలో ప్రవేశ పెట్టిన రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  గిరిజనులకు పోడు భూములకు హక్కు పత్రాలు  ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసారు. ఆమె దృష్టికి  కంభంపాడు, గుంటిమడుగు, కోయ రంగాపురం, కుడుములపాడు, గాండ్లగూడెం వివిధ గ్రామాలలో అటవీశాఖ అధికారులు సిబ్బంది కలిసి   పోడు సాగుదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిసిందనీ, అటవీశాఖ అధికారులు సిబ్బంది పద్దతి మార్చుకోవాలని సున్నం నాగమణి హెచ్చరించారు.  పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆమాయకపు ఆదివాసీ గిరిజనులు జోలికి వెళ్లొద్దని, పోడు భూములలో కందకాలు తవ్వి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్న  అటవీశాఖ అధికారులు సిబ్బందిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే తగిన మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: