CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమం: ప్రభుత్వ విప్.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రైతు వేదిక నందు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,32 మంది లబ్ధిదారులకు సుమారు 32 లక్షల రూపాయల విలువ గల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం నాడు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వారి పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని అన్నారు, అభివృద్ధి, సంక్షేమంలో, తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షల మంది లబ్ధి పొందారని అన్నారు, ప్రభుత్వాసుపత్రిలో ఆడబిడ్డ పుడితే 13000రూ/మగబిడ్డ పుడితే 12000రూ/ లతో కెసిఆర్ కిట్ పథకాన్ని అందజేస్తున్నామని వివరించారు.రాష్ట్రంలోని పేద బడుగు వర్గాలకు చెందిన పెళ్లిళ్లు చేసుకున్న యువతులకు రాష్ట్రప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పెళ్లిళ్లు ఖర్చుల కింద ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అయినా అన్నారు.ఆసరా పింఛన్ ,రైతుల కోసం, రైతుబంధు, రైతు బీమా,24 గంటల ఉచిత కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు, మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీటిని అందించడం జరుగుతుందని అన్నారు. మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట,రంజాన్ మాస పర్వదినం సందర్భంగా బట్టల పంపిణి చేశారు.టిఆర్ఎస్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరి సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ఎంత పెద్ద మనసుతో ముస్లింలకు బట్టలు పంపిణీ చేయడం చాలా అభినందనచదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను ఒకే విధంగా గౌరవిస్తున్నారని బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించు కొనీ బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ముస్లిం ప్రజానీకానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,00,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల తాసిల్దార్ సురేష్ కుమార్,అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, ఎంపీటీసీ తాటి పూజిత, గాదే జయ, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు అశోక్ కుమార్,తెరాస పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు, జాలే రామకృష్ణారెడ్డి, చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్,ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచు వెంకటరమణ, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొరస దుర్గారావు, బీసీ సెల్ అధ్యక్షులు మామిళ్ల కనిష్, యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, తాటి వెంకటేశ్వర్లు, మేడవరపు సుధీర్, నాయకులు నజీర్ సోను,ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల సీనియర్ నాయకులు, మండల యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు,పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: