CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇచ్చిన హామీలను అమలు చేయని సింగరేణి అధికారులు.దశలవారీ ఆందోళనకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా లో ఆగస్టు నెలలో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీ అధికారులు ఉద్యోగం ఊసే లేదని జాతీయ కార్మిక సంఘాలు మండిపడ్డాయి.బుధవారం స్థానిక సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి కార్యాలయంలో సిఐటి యు,ఏఐటియు,సిఐఎన్ టి యు సి,బిఎం ఎస్,హెచ్ ఎం ఎస్ జాతీయ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,మణుగూరు ఓసీ -2 లో ఆగస్టు నెలలో సింగరేణి డంపర్,ప్రైవేట్ వెహికల్ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. సాగర్,భాష,వెంకన్న లు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగం ఇస్తామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఇవ్వకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని,ప్రైవేట్ కార్మికుడు వెంకన్న కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న నల్ల బ్యాడ్జీలతో నిరసన మీటింగ్ నిర్వహిస్తామన్నారు.23వ తేదీన జిఎం కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అనంతరం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో నాయకులు రాంగోపాల్, రామ నరసయ్య,నంద ఈశ్వరరావు,వై రామ్మూర్తి, వెలగపల్లి జాన్,జాన్,రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: