CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ చిన్నకొర్రాజుల స్వామి జాతర మహోత్సవం.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర శుక్రవారంతో ముగిసింది. కొర్రాజుల స్వామి వారు వేదాంత పురం గ్రామంలో ప్రత్యేక ఆలయంలో ప్రవేశించినప్పటినుండి 5 రోజులపాటు జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర మెంబెర్ బోగి వీరాస్వామి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు జట్ల సత్యనారాయణ, పూచి గోవర్ధన్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్ల మందల శ్రీను, మండల గౌరవ అధ్యక్షులు కోలా లక్ష్మి నారాయణ, అశ్వారావుపేట, దమ్మపేట మండల అద్యక్షులు నారం సీతారాం సింగ్, రావుల రామకృష్ణ మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, గిరిజన సంఘ నాయకులు వందలాది మంది జనం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్యన స్వామి వారిని శుక్రవారం గ్రామంలో అత్యంత వైభవంగా ఊరేగింపు ఆనంతరం ప్రత్యేక ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నిప్పులు గుండాలో పలువురు భక్తులు స్వామి వారితో నడిచారు. జాతర వద్ద కొమ్ము నృత్యం చేసిన ఆదివాసి మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒంట్లో ఉన్న గాలి ధూళి, భయాందోళన పోవాలని భక్తులు నమ్మకంతో వరదాడుతో దెబ్బ తాకించుకున్నారు. అనంతరం జాతరకు విచ్చేసిన ప్రజలందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం గంధం పళ్ళు(భోజనాలు) కార్యక్రమంతో జాతర ముగిసింది. జాతర మహోత్సవంలో పాల్గొన్న ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం నాయకులు జాతర గురించి సంస్కృతి సాంప్రదాయాలు గురించి సమూహంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమిని శివప్రసాద్ మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఆదివాసి నాయకపోడు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆహ్వానాన్ని మన్నించి జాతికి విచ్చేసిన అతిరథమహారధులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Share it:

TS

Post A Comment: