CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంతరాలు లేని సమాజ నిర్మాణానికి విద్యార్థి పోరాటాలు ఉదృతం చేయాలి.--:గుమ్మడి నర్సయ్య,మాజీ ఎమ్మెల్యే

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ను స్థానిక జంపాల ప్రసాద్ నగర్ ( ఇల్లందు) లో నిర్వహించారు. ఈ సమావేశాలకి ముందుగా 

సంస్థ బిగిపిడికిలి జండాను PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ ఆవిష్కరించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె.సంధ్య అమరవీరుల సంతాపం ప్రవేశపెట్టారు.

పి డి ఎస్ యూ జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశాలను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే , ప్రజా పంథా పార్టీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య ప్రారంభోపన్యాసం చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన సామాజిక రుగ్మతలు అంతం చేయడానికి విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలో విద్యార్థి,ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసమాన పోరాటాలు జరిగాయని ఆ పోరాటాలలో విద్యార్థుల పాత్ర అమొఘమని గుర్తు చేశారు. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాట పంథా లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 


పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాగేశ్వరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ బలోపేతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిధుల కేటాయింపు తిరోగమనంలో ఉందని అన్నారు. కమిషన్లు వచ్చే పథకాలకు నిధులు కేటాయిస్తూ , దేశ అవసరాలకు ఉపయోగపడే మానవ వనరుల అభివృద్ధి కి మాత్రం నిధులు కేటాయింపు లో ప్రభుత్వ పెద్దలు మొండి చెయ్యి చూపుతున్నారని అన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ స్థాయి మొదలుకొని ప్రాథమిక పాటశాల వరకు మూసివేత ఆలోచనతో ఉన్నదని, ఈ చర్యలు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు పెంచాలని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ వ్యాప్తికి విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమంలో

పి డి ఎస్ యూ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు ఎనగంటి వంశీ వర్ధన్, కార్యదర్శి నరేందర్, ఇల్లందు టౌన్ కార్యదర్శి పార్థ సారధి, కోశాధికారి తరుణ్ , రాజ్ కుమార్, రవి చంద్ర, గంగరాజు, రంగ, రవీనా, మౌనిష, కావేరి, పూజ, స్వప్న, స్వర్ణ, మంగ, ముత్తేశ్వరి, నీలవేణి, స్వప్న, శ్రావణి,ఆది లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: