CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదలకు న్యాయం చేయాలి.

Share it:

 


దమ్మపేట ఏప్రిల్ 08 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట

మండల సిపిఐ పార్టీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సమితి సభ్యులు యార్లగడ్డ భాస్కర్ రావు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు పరిపాలనలో విఫలమయ్యాయని కేంద్ర ప్రభుత్వం అడ్డూ ఆపూ లేకుండా పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువులు విపరీతంగా రేట్లను పెంచుకుంటూ పోతుందని సగటు మనిషి బ్రతికే పరిస్థితి లేదని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చెయ్యలేని పథకాలను పెట్టి అరకొర చేస్తున్నారని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఊసే లేదని దళితులకు 3 ఎకరాల భూమి లేదని దళిత బంధువులందరికీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదని రేషన్ కార్డులు ఇవ్వలేదు పెన్షన్లు లేవు అని ఇండ్ల క్రమబద్ధీకరణ లేదని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వాగ్దానాలు ఆశల పల్లకిలో ఉన్నాయని ని తెలంగాణ గిరిజనులు పోడు భూమి సమస్య పరిష్కారం చేయలేదని ధరణిలో అన్ని తప్పులు తడకలు లేనని ఏ ఒక్క రైతుకు మేలు జరగలేదని రైతు రుణమాఫీ ఏమైందో తెలియదు అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వం గా చెప్పినారు సిపిఐ పార్టీ కార్యకర్తలు మండల వ్యాప్తంగా ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజలకు వివరించాలని ప్రతి గ్రామంలో సీపీఐ.కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాలని రాబోయే కాలంలో టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతి పంచాయతీలో సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని ఈ మండలంలో సిపిఐ పార్టీని ప్రధమ స్థానంలో ఉంచాలని అన్ని సమస్యలను తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండూరు వీరబాబు దస్తగిరి ధర్మ సత్యనారాయణ గాజు బోయిన కృష్ణవేణి జానీ బేగం బత్తుల సాయి మురళి నక్క నాగమణి వీరలక్ష్మి జన్ బి బెల్లం కృష్ణవేణి కొరస వెంకటేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: