CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెద్దాయ‌న‌పై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్ .

Share it:


న‌ల్ల‌గొండ : నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన పెద్దాయ‌న‌పై రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ప్రాంతానికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు.. కానీ ఆయ‌న చేసిన అభివృద్ధి శూన్యం అని కేటీఆర్ మండిప‌డ్డారు. ఆర‌డుగుల అజానుబాహుడు ఉన్న ఆరు గంట‌ల క‌రెంట్ రాలేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు.


ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించిన పెద్ద‌లు మంత్రిగా సుదీర్ఘ‌కాలం ప‌ని చేశారు. కానీ అభివృద్ధి విష‌యంలో ఈ జిల్లాకు ఏం చేయ‌లేదని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ప‌క్క‌నే కృష్ణా న‌ది ఉన్న‌ప్ప‌టికీ ఫ్లోరోసిస్‌తో బాధ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ నీళ్లు ఇవ్వ‌లేని అస‌మ‌ర్థ‌త ఆ నాయ‌కుల‌ది. తాగునీరు ఇవ్వ‌కపోయిన‌ప్ప‌టికీ, సాగునీటి రంగంలోనూ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాను నిర్ల‌క్ష్యం చేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.


ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్‌లో ఆయ‌న రికార్డు స‌మ‌యం ప‌ని చేశారు. కానీ ఆయ‌న ఏం ఉద్ధ‌రించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆర‌డుగుల అజానుబాహుడు ఉన్న ఆరు గంట‌ల క‌రెంట్ రాలేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. కానీ కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు ప్రేమికులం, రైతు బిడ్డ‌లం అని చెప్పుకున్నారు త‌ప్ప వారిని ప‌ట్టించుకోలేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: