గుండాల మే 29(మన్యం మనుగడ) కాచనపల్లి అమరుల అమరుల త్యాగాలు మరువలేనివని న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు పూనెం రంగన్న,అట్టికం శేఖర్, అన్నారు. ఆదివారం కాచనపల్లి అమరుల 31వ వర్ధంతిని ఘనంగా కాచనపల్లి గ్రామం లో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి, బుక్తి, విముక్తి కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన అన్నారు, ఎన్ కౌంటర్ లో మరణించిన కోటన్న, పరశురాములు, సీతారాములు, సుసేన, చింత లక్ష్మి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని వారు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమం లో నాయకులు బొమ్మెర వీరన్న, అట్టికం రమేష్ , ఏనుగంటి లాజర్, కృష్ణ , చిరంజీవి, శ్రీనివాస్, రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: