మన్యం మనుగడ ఏటూరు నాగారం
మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డులో భక్తాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు యల్లప్రగడ సూర్యనారాయణశర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలను నిర్వహించగా ఐటీడీఏ ఏఓ దామోదరస్వామి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ శాశ్వత నిర్వాహకులు హర్షవర్ధన్, గౌతమ్‌లు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి సిందురం, తమలపాకులతో పూజలు చేశారు. అర్చకులు భక్తులకు అర్చనలు, అష్టోత్రనామాలి పూజలు చేశారు. అనంతరం భక్తులు ఆంజనేయస్వామి చాలీసా, దండకం పటించి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అర్చకులు సూర్యనారాయణశర్మ, రామ్మూర్తి శర్మలు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో 1500ల మంది భక్తులు హాజరై స్వామివారి నివేదనను స్వీకరించారు. కార్యక్రమంలో సమ్మయ్య, మైనర్‌బాబు, సురేష్, బాలయ్య, సారయ్య, శివ, నరేష్, పవణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: