CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఏరియా స్టోర్ నందుగల ఈద్గా, ఖబ్రస్తాన్ ల పరిసర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం నాడు ముస్లిం మైనారిటీ నాయకులు,మత పెద్దలతో కలిసి సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,ఈద్గా,ఖబ్రస్తాన్ చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు,గేటు, మంచినీటి సౌకర్యం కు సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వారు తెలిపారు.మణుగూరు లో షాదీ ఖానా కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని,వీటికి సంబంధించి పనులు కూడా త్వరలోనే,ప్రారంభమవుతాయని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తుందని అన్నారు.టిఆర్ఎస్ పాలనలో ముస్లింల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పేద ముస్లింలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు రాష్ట్రంలో వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, విద్యను అందిస్తున్నట్లు విప్ రేగా తెలిపారు.అన్ని మతాలకు సమానంగా ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి,మైనారిటీలను గుర్తిస్తూ, అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మైనార్టీల పండుగలకు ప్రభుత్వం ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ నిధులు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లుకు షాదీ ముబారక్ పథకం కింద రూ.1,00,116 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.భవిష్యత్ లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం ప్రజాప్రతినిధులు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,మైనారిటీ అధ్యక్షులు హాబీబ్,టిఆర్ఎస్ నాయకులు బాబీ జాన్,ఎక్సలెంట్ విద్య సంస్థల చైర్మన్ యూసఫ్, టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన కార్యదర్శి రవి ప్రసాద్,మణుగూరు మండల, పట్టణ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు,ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: