మన్యం మనుగడ వాజేడు మే16:
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు ఉపాధిహామీలో పేర్కొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాజేడు మండల కేంద్రంలోని సంత పాకల నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంఘం నాయకులు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ హాజరై మాట్లాడుతూ ప్రజా సంఘాల తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సుమారు 45 గ్రామాల్లో లో సర్వేలు నిర్వహించగా గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలు ప్రజా సంఘాల దృష్టికి వచ్చాయని అందులో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో అనేక సమస్యలతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ,ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని,అలాగే అదనపు అలవెన్సులు, ఉపాధి హామీ పనులను గుట్టలపై కాకుండా వ్యవసాయ క్షేత్రాల్లో పని కనిపించేలా ఉపాది చట్టాన్ని అమలు చేయాలని కోరారు, ఎన్నికల హామీలు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ లు ,వృద్ధాప్యం, వితంతువుల,వికలాంగుల పింక్షన్స్ రాక గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమస్యల తీవ్రత ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి పరిష్కరించాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి తాహసిల్దార్ కార్యాలయం ముందు సమస్య పరిష్కారం అయ్యే వరకు కుటుంబాలతో కార్యాలయం ముందు వంటలు వార్పు కార్యక్రమాలతో పోరాటం చేస్తామని హెచ్చరించారు, అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మకి మెమోరాండం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య ,జిల్లా నాయకులు దామోదర్, యువజన సంఘం నాయకులు బచ్చాల కృష్ణ బాబు, ఐద్వా నాయకురాలు సౌమ్య, పేదం రమాదేవి ,వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గుగ్గిళ్ల దేవయ్య ,వాదం చంటి ,విజయ్ బాబు, సుధాకర్ ,భూలక్ష్మి, సీత, నర్సమ్మ ,వెంకటస్వామి ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: