CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హేమాచల నరసింహుడి యదన సుగంధ మాల....

Share it:


 

  • నాగవల్లి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సుగంధ మాల సమర్పించిన జాతీయ మిర్చి బోర్డ్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి దంపతులు....

మన్యం మనుగడ, మంగపేట.

హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి అరుదైన సుగంధ హారంతో అలంకరించబడ్డారు శుక్రవారం స్వామివారి నాగవల్లి కార్యక్రమం సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి స్నేహలత దంపతులు కేరళ రాష్ట్రం నుండి స్వామి వారి కోసం యాలకులతో ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హారాన్ని హేమాచల నరసింహుడి కి సమర్పించారు అంతేకాకుండా నాగవెల్లి సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను మరియూ పన్నెండు రకాల సుగంధ ద్రవ్యాలను పూలు పండ్లు సమర్పించారు సాంబశివరెడ్డి స్వామివారికి భారత ప్రభుత్వం తరుపున సుగంధద్రవ్యాలను తీసుకురావడంతో ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వామివారి నాగవల్లి కార్యక్రమానికి ఆహ్వానించారు ఆనంతరం సాంబశివ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో నాగవల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ మిర్చి బోర్డ్ డైరెక్టర్ గా స్వామివారికి పట్టువస్త్రాలు సుగంధ ద్రవ్యాలను బహూకరించడం ఎంతో సంతోషంగా ఉందని దేవుడి ఆశీస్సులు చల్లని దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్టు తెలిపారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని సాంబశివరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు ముకుమల్ల రాజశేఖర్ శర్మ కె పవన్ కుమార్ ఆచార్యులు ఈశ్వర్ చంద్ర శర్మ ఎం సీతారామయ్య తాళ్లూరు చందర్రావు ఆలయ చైర్మన్ నూతలకంటి ముకుందం కార్యక్రమ ఋత్వికులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు బృందం ఆలయ సిబ్బంది చక్రి పుల్లయ్య సీనియర్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు తిరుపతి రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: