CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వికాస్ అగ్రి ఫౌండేషన్ సేవలు మరువలేనివి.--:ములుగు ఎమ్మెల్యే సీతక్క..

Share it:



  • బాధితులకు అండగా ఉంటాం...
  • జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం మనుగడ, మంగపేట.

వికాస్ అగ్రి ఫౌండేషన్ సేవలు మరువలేనివని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు ఆదివారం మండలంలోని ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన శనిగకుంట గ్రామంలో బాధిత కుటుంబాలకు వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్షణ పునరావాసం కోసం సమకూర్చిన రూపాయలు లక్ష విలువైన నలబై టార్పాలిన్ పరదాలను సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఆపద సమయంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని కోరారు పునరావాసం కోసం పరాధాలను అందించిన వికాస్ పెర్టిలైజర్ యజమాని నాశిరెడ్డి సాంబశివరెడ్డి భాగ్యశ్రీ ఫర్టిలైజర్స్ యజమాని పచ్చిపులుసు నరేష్ లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని వారిని ఆదుకునేందుకు త్వరలోనే తమ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరామిరెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మురుకుట్ల నరేందర్, పెండ్యాల హరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి, నాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,లక్కీ వెంకన్న, కటుకూరి శేషయ్య,బోడెంపుడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: