మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :
తనపై అక్రమంగా కేసులు బనాయించి తనకు ఎఫ్ఐఆర్ కాఫీలు కూడా ఇవ్వకుండా పోలీసులు తనను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఐదో తేదీన తెల్లవారుజామున అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని అక్కడికి వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నడ్డి రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం విధితమే.. శనివారం తనపై అక్రమ కేసులు బనాయించారని వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాఫీలు కూడా ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నడ్డి రవికుమార్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసు బనాయించారని. వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాఫీలు ఇవ్వాలని మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఇవ్వకుండా తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్ లోకి వెళితే నేను దళితుడినని హేళన చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇదే విషయంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. అలాగే జిల్లా ఎస్పీ, డీఎస్పీని సైతం కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు
Post A Comment: