CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజలపై పన్నులభారం తగ్గించకపోతే సమరమే.రోజు,రోజుకు ప్రజలపై పడుతున్న పన్నులభారం తగ్గించకపోతే ఆందోళన ఉద్రృతమౌతుందని సిపియం జిల్లాకార్యదర్శి అన్నవరపు కనకయ్య హెచ్చరించారు

Share it:

 


ములకలపల్లి:(మే 27)మన్యం మనుగడ ప్రతినిధి: 

మండల కేంద్రం లోని వామపక్షాల ఆద్వర్యంలో ములకలపల్లి లో జరిగిన ప్రదర్శన, దర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కరోనా దెబ్బకు ఆర్ధికంగా చితికిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న ప్రజలపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పన్నులు పెంచుతున్నారని గత సంవత్సర కాలంగా డెబ్భై శాతం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల పై అన్ని రకాల పన్నులు పెంచారని ,నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజలు కొనుగోలు చేసి తినే స్థితిలో లేరని అన్నారు.చదివిన చదువు కు ఉద్యోగం రాక ,ఉపాధి లేక యవత ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం తన బాధ్యత మరచిపోయి పెట్టుబడి దారుల సేవలో తరిస్తున్నదని,ఇకనైన ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ పై విదించిన సెస్సు రద్దుచేయాలని ,ఎక్సైజ్ సుంకం తగ్గించాని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని ,ప్రతిపేద కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికుల కు నెలకు 26000 రూపాయలు ఇవ్వాలని,ఉపాధి హామీ పథకానికి నిదులుపెంచి పట్టణ ప్రాంతంలో పేదలకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ(యం ఎల్ ) ప్రజాపందా జిల్లా నాయకులు నూపా భాస్కర్ ,సిపిఐ (యం ఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గౌని నాగేశ్వరరావు సిపిఐ మండల నాయకులు నరాటి రమేష్ ,సిపియం మండలకార్యదర్శి ముదిగొండ రాంబాబు,సిపిఐ (యం ఎల్ )ప్రజాపందా మండల కార్యదర్శి కల్లూరి కిషోర్,పి.లక్మణ్ ,వూకంటి రవి కుమార్,నూపా సరోజిని,నిమ్మల మదు, వీరు,రామారావు,లక్ష్మీ నర్సయ్య,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: