CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పామాయిల్ రైతులకు శుభవార్త.లోను మూడు లక్షల నుండి 5 లక్షలకు పెంపు.

Share it:


  • యూనియన్ బ్యాంకు డీజీఎం హామీ 

 

మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట, దమ్మపేట, మండలాల యూనియన్ బ్యాంక్ రైతులకు యూనియన్ బ్యాంక్ డీజీఎం మురళి శుభవార్త అందించారు. అశ్వారావుపేట యూనియన్ బ్యాంక్ శాఖకు వచ్చిన సందర్భంగా పామాయిల్ వ్యవసాయమునకు కావలసిన ఎరువుల రేట్లు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోవటం వలన పామాయిల్ రైతులకు ఇచ్చే లోను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచ వలసిందిగా పామాయిల్ రైతులు కోరారు. డీజీమ్ సానుకూలంగా స్పందించి బ్యాంకు మేనేజర్ ని ప్రపోజల్స్ పంపమని ఆదేశించారు. ఈ నిర్ణయం పట్ల పామాయిల్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమమునకు కాసాని చంద్రశేఖర్, ఆలపాటి రాము, సీమకుర్తి వెంకటేశ్వర రావు, మేకలవ కుమార్ సోమయ్య, సీమకుర్తి చక్రధర్ తదితర రైతులు పాల్గొనడం జరిగింది.

Share it:

TS

Post A Comment: