CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫిట్నెస్ రెన్యువల్ పై 50 రూపాయల పెనాల్టీ రద్దుకై,మే19న జరిగే రవాణా బంద్ ను జయప్రదం చేయండి:కార్మిక సంఘాల జేఏసీ పిలుపు.

Share it:




మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ ఆటో,క్యాబ్,లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్నెస్ రెన్యువల్ పై రోజుకు 50 రూపాయల పెనాల్టీ రద్దుకై,మే 19 న జరిగే రవాణా బంద్ ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్.లక్ష్మీనారాయణ,ఆర్.మధుసూదన్ రెడ్డి,జీ.శ్రీనువాసు,ఎం. నాగేశ్వరరావు,పీ.భద్రం రవాణా రంగ కార్మికుల ను కోరారు.ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో అక్కి. నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం 2019,తీసుకువచ్చిందని,సేఫ్టీ పేరు చెప్పి,భారీ చలాన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు.మోటార్ కార్మికుల నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీ లు ఈ చట్టంలో పొందుపరిచి, మోటార్ కార్మికుల బ్రతుకుల పై పెనుభారం మోపిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్ గడువు అయిన తరువాత రోజుకు 50 రూపాయల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారని,ఒక్కొక్క వాహనం గత రెండు,మూడు సంవత్సరాల నుండి ఫిట్నెస్ లు పెండింగు లు ఉన్నాయని,గత రెండు సంవత్సరాలు కరోనా వలన ఆటో,క్యాబ్,లారీ కార్మికులు తీవ్రమైన నష్టాన్ని చవి చూశారు.అని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ ఖజానా నింపుకోవడానికి ఆటో,క్యాబ్,లారీ కార్మికులపై భారీ జరిమానాలు విధించడానికి పూనుకున్నాయి అని విమర్శించారు.ఫిట్నెస్ లేట్ కు రోజుకు 50 రూపాయల పెనాల్టీ విధానాన్ని అమలు చేస్తే,ఆటోలు,క్యాబ్ లు,లారీలు అమ్ముకున్నా చెల్లించలేని స్థితిలో కార్మికులు ఉన్నారని, కావున వెంటనే రోజుకు 50 రూపాయల పెనాల్టీ విధానాన్ని రద్దు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనితో పాటు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచటం వలన వాహనాలు నడప లేని స్థితిలో మోటార్ రంగ కార్మికులు ఉన్నారని, మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు,వాహనాల ఇన్సూరెన్స్ ధరలు విపరీతంగా పెరిగి మోటార్ రంగ కార్మికులు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని,పెరిగిన ధరలు అన్నింటినీ వెంటనే తగ్గించి మోటార్ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మే 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాలని తెలంగాణ ఆటో,క్యాబ్,లారీ సంఘాల జేఏసీ నిర్ణయించిందని,ఈ బంద్ ను విజయవంతం చేయాలని రవాణా రంగ కార్మికుల ను కోరారు.దశలవారీ ఆందోళనలో భాగంగా 16వ తారీకు విస్తృత ప్రచారం నిర్వహించి,17 వ తారీకు అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో జేఏసీ నాయకులు ఎండీ. గౌస్,ఎండి.సర్వర్,బిక్షం,సతీష్, మల్లేష్,సాంబ,తోట.రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Share it:

TS

Post A Comment: