CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

2023 వ సంవత్సరం లో తెలంగాణాలో అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.

Share it:

 


  • రైతు సంఘర్షణ సభ డిక్లరేషన్ తో నూతన ఉత్సహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

 ములకలపల్లి:మే 20:

మన్యం మనుగడ ప్రతినిధి: మండలంలోని మాదారం గ్రామంలో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి ఇంటి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ తాండ్ర ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సున్నం నాగమణి ముఖ్య అతిధిగా హాజరై ఈసందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని,రాహుల్ గాంధీ వరంగల్లో రైతు సంఘర్షణ సభా డిక్లరేషన్లో కాం గ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే, ఏకకాలంలో 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని,పోడు సాగు చేస్తున్నా ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు కల్పిస్తామని, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని,రైతులు,కౌలు రైతులకు ఎకరానికి15వేలు రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తామని,రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ, రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కోనేలా పండిన పంటకుగిట్టుబాటు ధరలు ముందే నిర్ణయిస్తాం, ధరణి పోర్టల్ రద్దు చేస్తూ, సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం,ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి12 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. అదేవిదంగా వివిధ కారణాలతో పంటలు నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తామని, మూతబడిన చెరుకు కర్మాగారాలను తెరిపించి,పసుపు బోర్డు ఏర్పాటు చేస్తం,రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన చిక్కులు రాకుండా అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని,తెలియజేసారు.ఈ సమావేశంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం డి అంజుమ్,పుష్పాల హన్మంత,ఖాదర్‌ బాబా,కోండ్రు రవి,సున్నం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: