CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.ఈనెల 18న జరిగే చర్చలో గతంలో ఇచ్చిన హామీలు పై ఒప్పందం చేసి అమలు చేయాలి*

Share it:



  • లేనియెడల నిరవధిక సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధం కావాలని జేఏసీ పిలుపు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని,ఉద్యోగ భద్రత, చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారానికై గతంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన సమ్మె డిమాండ్లను తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని, లేనియెడల సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెల్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో చేసిన దశలవారీ పోరాటాల ఫలితంగా ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చర్చలలో గతంలో ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన హామీలు పై ఒప్పందం చేసి తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ సమస్యలపై నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి సిద్ధం కావాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.కాంట్రాక్టు కార్మికుల ఆవేదన, అరకొర వేతనాలతో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సింగరేణి యాజమాన్యం,లేబర్ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని,సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో ఎండీ. గౌస్ అధ్యక్షతన మణుగూరు ఏరియా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి,వెలగపల్లి. జాన్, ఉప్పుతల. నరసింహారావు, పి. భద్రం, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: