CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదు.రిటైర్డ్ మున్సిపల్ కమీషనర్భూక్యా దేవ్ సింగ్.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

దేశంలో ఏ విద్యార్థికి కూడా చదువుకునే దశలో పేదరికం అడ్డంకిగా మారకూడదని రిటైర్డ్ మున్సిపల్ కమీషనర్ శ్రీ భూక్య దేవ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీ గూళ్ల వెంకటయ్య అన్నారు. శనివారం ఎక్కటి సరోజని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు ఫెయిర్ వెల్,మరియు వెల్కం పార్టీ కార్యక్రమం కళాశాల ప్రధానాచార్యులు వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ మున్సిపల్ కమీషనర్ భూక్య దేవ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ వెంకటయ్య భూక్య దేవ్ సింగ్ ను శాలువతో సన్మానించారు అనంతరం ఎంసెట్, నీట్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఆ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను దేవ్ సింగ్ ఉచితంగా పంపిణీ చేశారు.విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ వినియోగం మానివేయాలని కాంక్షిస్తూ ప్రతి విద్యార్థికి జ్యూట్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ కలిగిన ఎందరో విద్యార్థులు ఆర్ధిక పరిస్థితులు సహాకరించక చదువు మధ్యలోనే మానివేస్తున్నారని అది సరైన ఆలోచన కాదన్నారు. ఈనాడు దేశ,విదేశాల్లోని పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారందరు కూడా పేద కుటుంబాల్లో నుండే వచ్చిన వారేనన్నారు. అలాంటి వారిని ఆదర్శముగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాదించడానికి శ్రమించాలన్నారు. ఉన్నత చదువుల ద్వారానే ఉన్నత ఆశయాలు నెరవేరుతాయాని తద్వారా కన్నవారికి,ఉన్న ఊరికి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు. వై. రేణుకాదేవి, ఎం.సంతోష్ కుమార్,జె.జ్యోతిర్మయి, సిహెచ్. శైలేందర్, ఎం.లక్ష్మణ,జి.సతీష్,పి.అనిల్ కుమార్,ఎం.చిరంజీవి,కె.శ్యామ్.టి.నరేష్ బోధనేతర సిబ్బంది అరుణ్ కుమార్, లక్ష్మీ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: