CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శనిగ కుంట అగ్నిప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

మంగపేట మండలం శనిగ కుంట గ్రామంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు దగ్ధమైన బాధితులను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పరామర్శించారు.

శుక్రవారం శనిగ కుంట గ్రామం జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఏ ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి హుటాహుటిన ఉదయం బాధితులను పరామర్శించి అగ్ని ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసు కున్నారు.ఎరగడి వల్ల సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల 24 ఇళ్లు పూర్తిగా దగ్ధం కావడం 40 కుటుంబాలు తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.జిల్లా పంచాయతీ అధికారి,ఫారెస్ట్ అధికారులు సహాయంతో తక్షణ సహాయం కింద వారికి షెడ్డు నిర్మాణం చేయాలని ఆదేశించారు.ఇళ్లల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ కూడా ఖాళీ బూడిదగా మారాయని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, జిల్లా కలెక్టర్ వారు చదివిన స్కూల్,కాలేజీ అడ్రస్ తో ఏ సంవత్సరం లో ఉత్తీర్ణత సాధించారు అనే అంశాలను ధృవీకరించింది ఇచ్చినట్లు అయితే బోర్డ్ అధికారులతో మాట్లాడి డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇప్పిస్తానని వారు అన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెంట ఏ ఎస్పి అశోక్ కుమార్, డి పి ఓ వెంకయ్య, మంగపేట మండల ప్రత్యేక అధికారి తులా రవి, రెవిన్యూ సిబ్బంది మంగపేట తాసిల్దార్, ఫారెస్ట్ అధికారులు తదితరులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: