CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇళయరాజాకి ఇంగిత జ్ఞానం లేదా.. మోదీని అంబేద్కర్‌తో పోలుస్తాడా.. మెస్ట్రోపై నెటిజన్స్ ఫైర్..!

Share it:

 



సంగీతమే ప్రపంచంగా బ్రతికే ఇళయరాజా ప్రస్తుతం తమిళనాడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాడు. మోడీ అన్నా, మోడీ విధానాలన్నా.. ఒంటికాలిపై లేచే దేశప్రజల్లో తమిళనాడు జనాలు ముందుంటారు. జల్లికట్టుని నిషేదించాలని మోడీ తీవ్రంగా ప్రయత్నించి.. తమిళ ప్రజలతో గోక్కుని బంగపడ్డాడు. తమిళులంతా ఏకతాటిపైకి వచ్చి మోడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమయింది. ఇక దక్షిణ భారతీయులపై హిందీ భాషనీ బలవంతంగా రుద్దాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా తమిళులు భగ్గుమంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీపై మ్యాస్ట్రో ఇళయరాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించి ఇళయరాజా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో మోదీ సాగిస్తున్న సుపరిపాలన చూస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తప్పకుండా గర్వించేవారని వ్యాఖ్యలు చేశాడు.


అసలు బీజేపీ అంటేనే దళిత వ్యతిరేక ప్రభుత్వం. దళితులంటేనే బీజేపీ అవహేళనగా చూస్తుంది. సెంట్రల్ నుండి స్టేట్ వరకు బీజేపీ నేతల్లో కొట్టొచ్చినట్టు కుల అహంకారం కనిపిస్తుంటుంది. అలాంటి బీజేపీ పార్టీ ప్రధాని మోడీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తో పోల్చిన మెస్ట్రోపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు, దూషణలు వెల్లువెత్తుతున్నాయి. ‘అంబేడ్కర్‌ అండ్‌ మోడీ:రీఫార్మర్స్‌ ఐడియాస్‌, పెర్ఫార్మెర్స్‌ ఇంప్లిమెంటేషన్‌’ అనే పుస్తకానికి ఇళయరాజా రాసిన ముందుమాట ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. తమిళనాడు సహా పలు రాష్ట్రాల దళిత సంఘాలు, నెటిజన్లు మెస్ట్రోపై మండిపడుతున్నాయి. మోడీని అంబేడ్కర్‌తో పోల్చడమేంటీ.. నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.


అంబేద్కర్, మోదీ ఒకే తరహా నేపథ్యం నుంచి వచ్చారని, ఇరువురు పేదరికాన్ని, అణచివేతను చవిచూసిన వారేనని ఇళయారాజా గుర్తుచేశారు. తాము ఎదుర్కొన్న రుగ్మతలను రూపుమాపేందుకు ఇరువురు కృషి చేశారని, భారతదేశ సమున్నత భవిష్యత్ కోసం ఇద్దరూ పెద్ద కలలు కన్నవారేనని వివరించారు. దేశ అభ్యున్నతి కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెట్టారని తెలిపారు. మోదీ అండ్ అంబేద్కర్ అనే పుస్తకం ఇరువురి మధ్య ఉన్న పోలికలను తెలియజేస్తుందని ఇళయరాజా కామెంట్స్ చేశాడు. కాగా, పలు పార్టీల నేతలు, నెటిజన్లు.. ఇళయరాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజావి పరువు, బరువు తక్కువ మాటలని తిట్టిపోశారు. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితుల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడానికి వీలులేదని డీఎంకే ఎంపీ టీకేఎస్‌ ఎలంగొవాన్‌ విమర్శించారు.

Share it:

TS

Post A Comment: