CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ మారుమూల గ్రామానికి ఆంబులెన్స్ సర్వీసు ప్రారంభించడం శుభపరిణామం .. రోటరీ క్లబ్ గవర్నర్ ప్రభాకర్.

Share it:

 


  • సినీ దర్శకనిర్మాత పాకలపాటి విజయ వర్మ సేవలు అభినందనీయం..


మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం మారుమూల గ్రామాల అయినా కొత్తపల్లి,కోయనరసాపురం, రామచంద్రుని పేట, మారాయిగూడెం, లచ్చగూడెం, నారాయణరావుపేట 6 గ్రామ పంచాయతీల ప్రజల అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఏర్పాటుచేసిన అంబులెన్స్ సర్వీస్ను ఈ రోజు ప్రారంభించారు. చెరుపల్లి ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సభలో రోటరీ క్లబ్, షిర్డీ సాయి సంస్థాన్(USA) ఆదిత్యఓం ( సినీ హీరో ) దర్శకనిర్మాత పాకలపాటి విజయ వర్మ వారి సహకారంతో తో అంబులెన్స్ సర్వీస్ను రోటరీ క్లబ్ గవర్నర్ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయంతో మారుమూల ప్రాంతమైన ఆదివాసులకు అత్యవసర వైద్య సేవలు అందించడం కోసం అంబులెన్స్ సేవలు అందించడం జరిగిందని, 6 గ్రామ పంచాయితీ సర్పంచులు బాధ్యతగా సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో విద్యకు సంబంధించిన సహకారం కూడ అందిస్తామని తెలియజేశారుఆదివాసీ లకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయరాదని తెలియజేశారు. చెరుపల్లి గ్రామని దత్తత తీసుకున్నటువంటి సినీహీరో ఆదిత్యం,చేరుపల్లి వాస్తవ్యులు దర్శకనిర్మాత పాకలపాటి విజయ వర్మ వీరి సేవలు ఇలాగే కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో సురేన్ పోతురి ,కోట మధుసూదన్ రావు భద్రాచలం రోటరీ క్లబ్ అధ్యక్షుడు, శంకర్ రెడ్డి, చలపతి రావు, సర్పంచులు వెంకటేశ్వరవు, అశ్విని, తిరుపతిరావు, కల్లూరి రజని,ఎం పి టి సి పుసం ధర్మరాజు ,రేసు విరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: