CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా -జడ్పీటీసీ సున్నం నాగమణి.

Share it:

 


 

మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో ఎంపీటీసి సత్యవరపు తిరుమల ఇంటి వద్దా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగళ్లపు చెన్నకేశవరావు అధ్యక్షతన, ముఖ్యఅతిథిగా టిపిసిసి మెంబర్ మరియు జడ్పీటీసీ ములకలపల్లి సున్నం నాగమణి పాల్గొన్నారు. ఈ సమావేశాలను ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా అని సున్నం నాగమణి ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి కేంద్ర ప్రభుత్వం అందుకు బదులుగా అన్నదాతలపై పెట్టుబడి ఎరువులు భారాన్ని మాత్రం రెట్టింపు చేసిందని ఆరోపిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం ఒకపక్క పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేమేం తక్కువ తిన్నామని కరెంటు ఛార్జీలు, బస్సు చార్జీలు పెంచారని ఆరోపించారు. ఆదివాసీ గిరిజనులు పోడు భూములకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు స్వీకరించి నెలలు గడుస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం హక్కుపత్రాలు ఇవ్వకపోగా అటవీశాఖ అధికారులను పురమాయించి కందకాలు తవ్వించడం తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ధాన్యం కొనేవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా ధాన్యం కొనే వరకు పోరాటం చేస్తామని సున్నం నాగమణి తెలిపారు. రైతుల దగ్గర్నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యకపోతే రైతుల పక్షాన నిలబడి మంత్రులు గానీ ఎంపీలు గానీ ఎంఎల్ఏ లు గానీ గ్రామాల్లో తిరగనీయమని సున్నం నాగమణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు తిరుమల ఎంపీటీసీ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బుాసి పాండురంగా, సత్యవరపు బాలగంగాధర్, బండారు మహేష్, జల్లిపల్లి దేవరాజ్, మునగాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: