CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాలల హక్కులు కాపాడాలి.బాల అదాలత్ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

బాలల హక్కులు కాపాడాలని అందుకు ఒక గొప్ప ఫ్లాట్ఫామ్ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని చైర్పర్సన్ శ్రీనివాసరావు అన్నారు.రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలల సమస్యల పై విచారణ ఈ కార్యక్రమానికి ఏటూరు నాగారం,ఐటిడిఎ కార్యాల యానికి విచ్చేసిన రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు,శోభారాణి బాలల హక్కుల కమిషన్ బృందానికి జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.జిల్లా ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ చిత్రపటాన్ని వారికి అందించారు.గురువారం ఐటిడిఎ ఏటూర్ నాగారం కార్యాలయంలో మహిళలు శిశువులు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల అదాలత్ కార్యక్రమంలో పాల్గొని పిటిషన్లు కమిషన్ పరిశీలించింది.దాదాపుగా

ఐటీడీఏ కార్యాలయం లో బాల అదాలత్ సంబంధించిన కౌంటర్స్ పర్యవేక్షణ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్,డిఆర్ ఓ రమాదేవి రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ బృందంతో కలిసి బాల అదాలత్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంప్రారంభించారు.

రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ బాలల హక్కులపై ప్రసంగించారు.రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. బాలల హక్కుల పరిరక్షణ బాలలకు జీవించే హక్కు తో పాటు వారికి ఉండవలసిన హక్కులు చిన్నచిన్న సమస్య లేమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి గొప్ప ఫ్లాట్ఫామ్ బాల అదాలత్ కార్యక్రమం అని అన్నారు.

ట్రైబల్ ఏరియా లో పిల్లల దగ్గరికి కమిషన్ వచ్చిందని అందరి సమిష్టి కృషి వల్ల బాలల సమస్యలు పరిష్కారం అవుతాయని సమిష్టి భావన గొప్పదని జిల్లా అధికారులు పిల్లల సమస్యలను ముందు పెట్టి వాటిని పరిష్కరించాలని పిల్లల రక్షణ ఉపయోగార్ధం గా ముందుకుపోవాలని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ మాట్లాడుతూ బాలల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం కృషి ఎంతగానో ఉందని వారు అన్నారు.రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఏటూరు నాగారం లాంటి ఈ ప్రాంతానికి రావడం సంతోషకరమని అన్నారు.బాలల సమస్య పరిష్కారానికి ఈ బాల అదాలత్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగ దాయకం అన్నారు. 

ఈ సమావేశ ప్రారంభంలో జిల్లా రెవెన్యూ అధికారి కె రమాదేవి మాట్లాడుతూ.ములుగు జిల్లా మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో బాలలకు ఇలాంటి సమస్యలు రాకుండా బాలల సంరక్షణ బాలల హక్కులను కాపాడు తున్నారని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ బృందం చాలా ఉత్సాహంగా పనిచేస్తుందని వారు అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ బృందం బృందా ధర్ రావు,రాగ జ్యోతి,శోభారాణి,సి డబ్యు సి ఛైర్మెన్ వసుధ,డా. ఏ.మధు,జిల్లా సంక్షేమ అధికారి ప్రేమ లత,జిల్లా సంక్షేమ అధికారులు జిల్లా వైద్య అధికారి అప్పయ్య,డి ఆర్ డి ఓ నాగ పద్మజ,షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి పి భాగ్యలక్ష్మి,బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్,సంబంధిత శాఖ అధికారులు సఖి అంగన్వాడి టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: