మన్యం మనుగడ, మణుగూరు: మణుగూరు ఏరియాలోని భగత్ సింగ్ నగర్ వాసులకు గోదావరి నీటిని విడుదల చేయాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి జిఎం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా భగత్ సింగ్ నగర్ వాసులకు గోదావరి నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. అసలే ఎండాకాలం కావడంతో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజీరా నీటి కనెక్షన్లు ఇచ్చింది కాబట్టి గోదావరి నీటిని మేము ఇవ్వలేమని సింగరేణి సిబ్బంది చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. అంతేకాక మంజీరా నల్లా నుండి వచ్చే నీరు మురికి మయంగా ఉందని దీన్ని ప్రజలు ఎలా తాగుతారు అని ఆయన ప్రశ్నించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం గోదావరి నీటిని సరఫరా చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ గౌస్, వి జానయ్య, తిరుపతి, జయరామ్, కాలనీవాసులు నస్రీన్, బాబు, తిరుపతమ్మ, రాంబాబు, నిర్మల, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: